Pawan Kalyan : ఎల్లుండి నుంచి సినిమా సెట్స్ పైకి పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఎల్లుండి నుంచి సినిమా సెట్స్ పైకి పవన్ కళ్యాణ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' కోసం మళ్లీ సెట్స్ పైకి వస్తున్నారు. మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని, వీలు చూసుకొని షూటింగ్ కోసం తగు సమయం కేటాయిస్తానని మాట ఇచ్చారు. మాటకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.

సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా. భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో "హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు.

Tags

Next Story