Pawan Kalyan : పుష్ప 2 పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

Pawan Kalyan : పుష్ప 2 పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
X

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ .. పుష్ప సినిమా థీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేరుగా పుష్ప పేరు ప్రస్తావించలేదు కానీ ఆ థీమ్ వల్ల.. లేదా అలాంటి సినిమాల వల్ల సంస్కృతి ఎంత దెబ్బ తింటుందో ఎక్స్ ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ‘40యేళ్ల క్రితం హరోలు అడవులను కాపాడే వారు. కానీ ఇప్పుడు అడవులను ధ్వంసం చేసేవాళ్లు హీరోలవుతున్నారు. గంధద గుడి (కన్నడ సినిమా / డాక్యుమెంటరీ) అడవులను కాపాడమని చెబుతుంది. నేను సినిమా మనిషినే అయినా ఎప్పుడూ నేను సరిగ్గానే ఉన్నానా అని చెక్ చేసుకుంటాను..’’ అంటూ తనను ఎన్నుకున్న పిఠాపురం ప్రజలకు థ్యాంక్స్ చెప్పేలా ఆయన మాటలు సాగాయి.

సో.. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా పుష్ప నో లేక అల్లు అర్జున్ నో అనకపోయినా ఈ మధ్య కాలంలో గంధపు చెక్కల దొంగ సినిమా అంటే పుష్పనే. అలాంటి దొంగలు హీరోలవుతున్నారు అని ఇన్ డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే అనేశాడు. కాకపోతే పేర్లు చెప్పలేదంతే. మొత్తంగా పవన్ కళ్యాణ్ యధాలాపంగా అన్నాడా లేక కావాలనే ఈ మూవీని టార్గెట్ చేశాడా.. లేక కన్నడలో వచ్చిన గంధద గుడి అనేది మోస్ట్ ఫేమస్ మూవీ కాబట్టి దాన్ని పొగిడేందుకు అన్నాడా అని అంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు గంధద గురి సందర్భం కాదు. సో.. ఇక అర్థిం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.

Tags

Next Story