Pawan Kalyan : అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్..

Pawan Kalyan: అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. పవన్ కల్యాణ్ డైలాగ్‌ను.. జగన్ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు అన్వయిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును పోల్చి చూస్తున్నారు. జగన్ తన పంతం కొద్దీ తెలుగు సినిమా పెద్దలు తన దగ్గరకే వచ్చేలా చేయించుకున్నారన్న విమర్శలు బలంగా వినిపించాయి.
పైగా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తామో చెప్పకుండా, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా, విశాఖకు ఇండస్ట్రీని రప్పించండని జగన్ మాట వరసకు ఓ మాట విసిరారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీని మరోలా చూసుకుంటోందని చెప్పుకుంటున్నారు.
ఇందుకు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. భారత చలన చిత్ర పరిశ్రమకి హైదరాబాద్‌ను ఒక సుస్థిరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ధృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిలో పవన్ కల్యాణ్‌తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ సహకరించాలని కోరారు. గోదావరి జలాలు ప్రవహించే కాళేశ్వరం ప్రాజెక్ట్.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ల వద్ద కూడా షూటింగ్‌లు చేయవచ్చని కేటీఆర్ సూచించారు.
తెలుగు సినిమానే కాదు బాలీవుడ్, హాలీవుడ్ సైతం హైదరాబాద్‌ను హబ్‌గా చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీని ఆదరించడం అంటే ఇలా ఉంటుందని.. కాని, జగన్ చేస్తున్నది ఏంటని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఎక్కడా డైరెక్ట్‌గా కామెంట్స్ చేయనప్పటికీ.. అండర్‌లైన్‌గా జగన్ హయాంలో జరుగుతున్నదేంటి, కేసీఆర్ నాయకత్వంలో ఇండస్ట్రీకి వస్తున్నదేంటనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు అంటూ చెప్పుకొచ్చారు.
సినిమా అనేది కళాకారులు కలిసే ప్రాంతమని, నిజమైన కళాకారుడికి కులం, మతం ఉండబోవని మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమ చాలా బాగా ముందుకు వెళ్తోందంటూ ప్రశంసించారు. చిత్ర పరిశ్రమకు ఎలాంటి అవసరం ఉన్నాసరే మంత్రి తలసాని శ్రీనివాస్ ఎప్పుడూ ముందుంటారంటూ చెప్పుకొచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమ దేశానికే సినిమా హబ్‌గా ఉండాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు మంత్రి తలసాని. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగిల్ విండో అనుమతులు, టికెట్ రేట్లు, ఐదో ఆటకు పర్మిషన్స్.. ఇలా అన్ని విషయాల్లో అనుకూల నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
చిత్ర పరిశ్రమ బాగుండాలని, 24 విభాగాల కార్మికులు బాగుండాలనేదే తెలంగాణ ప్రభుత్వం కోరిక అన్నారు తలసాని. చిత్ర పరిశ్రమ పట్ల తెలంగాణ మంత్రుల సానుకూల మాటలకు, జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి అస్సలు పొంతనే లేదని.. నిన్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ చూసిన తెలుగు రాష్ట్రాల వాళ్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
తెలంగాణలో భీమ్లా నాయక్ సినిమా ఐదవ షో కోసం అనుమతి అడగగానే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చని జీవో ఇచ్చింది. థియేటర్ల వద్ద హెవీ రష్‌ని తగ్గించటానికి, బ్లాక్ టికెట్ల నిరోధానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఐదో షో పర్మిషన్ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణాలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రాలో మాత్రం టికెట్ రేట్ల సమస్య కొనసాగుతూనే ఉంది. ఐదో ఆట ఊసే ఎత్తొద్దని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో బెనిఫిట్ షోలు పడే పరిస్థితి కూడా లేదు. దీంతో ఏపీలో పవన్ అభిమానులు, థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు జగన్ సర్కారుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అనుకూలంగా స్పందిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం కక్షగట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ సినిమాపై ప్రభుత్వం కావాలనే అణచివేత ధోరణి అవలంభిస్తోందని అభిమానులు, సినీ పెద్దలు, థియేటర్ల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలు, అదనపు ప్రదర్శనలు వేస్తే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసులలో అధికారులు స్పష్టం చేశారు.
జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకపోతే గనక సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు తహసీల్దార్ హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోనూ ప్రస్తుత నిబంధనలు అమలు చేయాలంటూ.. తహసీల్దార్లకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.
వీఆర్ఓలను థియేటర్ల దగ్గరకు పంపాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. కాకినాడలోని తిరుమల థియేటర్‌లో ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
జీవో నెంబరు 35 ప్రకారం ఆన్‌లైన్ విధానం ద్వారా టికెట్ల అమ్మకం చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. విశాఖ జిల్లా అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ.. పరిస్థితి ఇలాగే ఉంది. మొత్తానికి భీమ్లా నాయక్‌తో.. తెలుగు ఇండస్ట్రీపై జగన్ ప్రభుత్వం ఎలాంటి ధోరణితో వెళ్తోందన్న చర్చ రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది.
అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం
పవన్ డైలాగ్‌ను జగన్ సర్కార్‌కు, టాలీవుడ్‌కు అన్వయిస్తున్న జనం
ఇండస్ట్రీపై తెలుగు రాష్ట్రాల వ్యవహార తీరును పోల్చి చూస్తున్న సినీపెద్దలు
పంతంతో సినీ పెద్దలను జగన్ తన దగ్గరకే రప్పించుకున్నారన్న విమర్శలు
తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీని మరోలా చూసుకుంటోందంటూ పోలికలు
ఏ సౌకర్యాలు కల్పించకుండా విశాఖకు వచ్చేయండని జగన్ ఆఫర్లు
సౌకర్యాలు చూపించి ఇండస్ట్రీయే వచ్చేలా తెలంగాణలో ఏర్పాట్లు
ఇండియన్ సినిమాకి హైదరాబాద్ హబ్‌గా ఉండాలనుకుంటున్నాం: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ కృషికి సినీ పెద్దలు సహకరించాలంటూ కేటీఆర్ కామెంట్స్
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద షూటింగ్‌లు చేయవచ్చని కేటీఆర్ ఆఫర్
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్‌ను హబ్‌గా చేసుకోవాలన్న కేసీఆర్
సినిమా ఇండస్ట్రీని ఆదరించడం అంటే ఇలా ఉంటుందంటున్న జనం
కాని.. జగన్ చేస్తున్నది ఏంటని బహిరంగ విమర్శలు
ఐదో షో అనుమతి అడగ్గానే తెలంగాణ ప్రభుత్వం అనుమతి
తెలంగాణలోని ప్రతి థియేటర్‌లో ఐదో ఆట ప్రదర్శించుకోవచ్చని జీవో
ఏపీలో మాత్రం ఐదో ఆట ఊసే ఎత్తొద్దంటున్న జగన్ ప్రభుత్వం
జగన్ సర్కారుపై అభిమానులు, థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్ల అసహనం
ఐదో షో అనుమతి అడగ్గానే తెలంగాణ ప్రభుత్వం అనుమతి
తెలంగాణలోని ప్రతి థియేటర్‌లో ఐదో ఆట ప్రదర్శించుకోవచ్చని జీవో
ఏపీలో మాత్రం ఐదో ఆట ఊసే ఎత్తొద్దంటున్న జగన్ ప్రభుత్వం
జగన్ సర్కారుపై అభిమానులు, థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్ల అసహనం
బెనిఫిట్ షోలు, అదనపు ప్రదర్శనలు వేస్తే కఠిన చర్యలంటూ నోటీసులు
జీవో 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకపోతే చర్యలంటూ హెచ్చరికలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com