Pawan Kalyan : పవన్ మరో రీమేక్.. యంగ్ డైరెక్టర్‌‌కి క్రేజీ ఛాన్స్..!

Pawan Kalyan : పవన్ మరో రీమేక్.. యంగ్ డైరెక్టర్‌‌కి క్రేజీ ఛాన్స్..!
Pawan Kalyan : వకీల్ సాబ్ సినిమాతో సూపర్ కొట్టి టాలీవుడ్‌‌కి గ్రాండ్‌‌గా రీఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : వకీల్ సాబ్ సినిమాతో సూపర్ కొట్టి టాలీవుడ్‌‌కి గ్రాండ్‌‌గా రీఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్... తాజాగా భీమ్లానాయక్ సినిమాతో మరో సూపర్ సక్సెస్ అందుకున్నారు పవర్ స్టార్.. అయితే ఈ రెండు చిత్రాలు రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు దర్శకులు క్రిష్, హరీష్ శంకర్ లతో డైరెక్ట్ మూవీస్ చేస్తున్నారు పవన్.

వీటి తర్వాత మరో రీమేక్ చేసేందుకు పవన్ ప్లాన్ చేశారు. తమిళ చిత్రం వినోదయసితం సినిమాని పవన్ రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ్‌‌లో సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా.. అక్టోబర్ 13న ZEE5 ఓటీటీలో రిలీజై విమర్శల ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాని చూసిన పవన్.. తెలుగులో రీమేక్ చేయాలనీ భావించారట. అయితే తెలుగులో ఈ సినిమాకి కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం ముందునుంచి నడిచింది. కానీ ఇప్పుడా ప్లేస్ లోకి ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.

సాహో ఫేమ్ సుజీత్ ఈ రీమేక్‌‌కి దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించనున్నారట. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Tags

Read MoreRead Less
Next Story