Pawan Kalyan : ‘ఉస్తాద్’సెట్ లోకి పవన్ కళ్యాణ్

Pawan Kalyan :  ‘ఉస్తాద్’సెట్ లోకి పవన్ కళ్యాణ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. అంటే మంత్రిగా కాదు.. హీరోగా. యస్.. ఆల్రెడీ హరిహర వీరమల్లును పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓ.జి షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఆ మేరకు పూర్తయ్యేలా పవన్ కూడా నిర్మాతకు డేట్స్ ఇచ్చేశాడు. ముందు అడిగిన డేట్స్ కంటే కాస్త ఎక్కువ రోజులే కేటాయించాడు ఓ. జి చిత్రానికి. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం పక్కా అనే నమ్మకంతో ఉన్నాడు సుజిత్.

ఇక వీటి తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేస్తున్నాడు పవన్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ కోసం నెల రోజుల డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ షూటింగ్ జూన్ రెండో వారం తర్వాత నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ నెల రోజుల పాటు ఏకధాటిగా సాగే చిత్రీకరణతో పవన్ కు సంబంధించిన మేజర్ పార్ట్ ను పూర్తి చేయబోతున్నారు. నిజానికి ఈ చిత్రం తమిళ్ లో హిట్ అయిన తెరికి రీమేక్ అని చెప్పారు. పవన్ డిప్యూటీ సిఎమ్ అయ్యాడు కాబట్టి.. రీసెంట్ గా కథలో అనేక మార్పులు చేశారు. ఆ మార్పులను మళ్లీ చిత్రీకరించబోతున్నారు. అంటే రీమేక్ తాలూకూ ఛాయలేవీ ఇందులో ఉండకుండా చూసుకుంటున్నారు. అది కూడా పవన్ చెప్పిందే. ఇక ఈ నెల రోజులు హైదరాబాద్ లోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేయబోతున్నారు. సో.. మధ్యలో పొలిటికల్ గా ఏవైనా పెద్ద ఇష్యూస్ అయితే తప్ప.. పవన్ బయటకు వెళ్లడు. సో.. ఉస్తాద్ ను కూడా ఈ యేడాది లేదా వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల చేసేలా ముస్తాబు చేస్తున్నారు.

Tags

Next Story