Jayamma Panchayathi: జయమ్మ పంచాయితీకి వచ్చిన పవన్..

Jayamma Panchayathi: ఎవర్ గ్రీన్ యాంకర్ సుమ నటించిన సినిమా జయమ్మ పంచాయితీ.. ఈ చిత్రం ట్రైలర్ ని శనివారం ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వేసవి కానుకగా ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తోంది.. కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సెటైర్లు వేస్తూ ఉండే సుమ పవర్ ఫుల్ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
" రా బావా మా ఊరి పంచాయితీ సూద్దువుగాని, ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవొకటి మా ఊర్లో జరుగుతాంది" అనే మాటలతో ట్రైలర్ సాగింది. నా కర్మేంటో ఊళ్లో సమస్యలన్నీ మా ఆయన జబ్బు సుట్టే ఉన్నాయి అంటూ సుమ చెప్పే డైలాగులు, పండించే హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఊరి సమస్యల పరిష్కారానికి జయమ్మ కొంగుబిగిస్తుంది.. ఊరిని ఒకదారిలోకి తెస్తుందనే విషయం ట్రైలర్ లో కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com