Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉస్తాద్.. ఉన్నట్టా.. లేనట్టా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉస్తాద్.. ఉన్నట్టా.. లేనట్టా..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ లోకి వచ్చిన తర్వాత సినిమాల సంగతేంటీ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కొత్తగా ఒప్పుకోకపోయినా.. ఆల్రెడీ కమిట్ అయినవీ.. సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలూ ఉన్నాయి కదా. అవెప్పుడు కంప్లీట్ చేస్తారు అనే అంశంపై రోజుకో రకంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కమిట్ అయిన వాటిలో ‘ఓ.జి’ మూవీ మాగ్జిమం షూటింగ్ పూర్తయింది. ఓ 20 రోజులు డేట్స్ కేటాయిస్తే అయిపోతుంది. ఈ మేరకు పవన్ గతంలోనే ఓజిని ఖచ్చితంగా పూర్తి చేద్దాం అని హామీ ఇచ్చాడట దర్శక నిర్మాతలకు. కానీ అది ఎప్పుడు అనేదే తేలడం లేదు. మరోవైపు హరీశ్ శంకర్ తో కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ ఇదే జరిగింది. రీసెంట్ గా నిర్మాతలు ఆయన్నిఅప్రోచ్ అయితే ఉస్తాద్ షూటింగ్ పై హామీ ఇచ్చాడట. సరే ఇప్పుడు రియల్ పొలిటీషియన్ కాబట్టి హామీలు ఇవ్వడం ఓకే. బట్ అవి ఎప్పుడు నెరవేర్చబోతున్నాడు అనేది కదా అసలు క్వశ్చన్.

ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోన్న దాన్ని బట్టి చూస్తే.. ఉస్తాద్ మేటర్ ఇప్పట్లో తేలడం కష్టమే అంటున్నారు. నిర్మాతలకు ఆయన ఏం చెప్పాడు అన్నది పక్కన బెడితే ప్రస్తుతం ఫోకస్ అంతా పాలిటిక్స్ పైనే ఉందట. డిప్యూటీ సిఎమ్ కూడా కాబట్టి.. ప్రస్తుతం అన్ని విభాగాలపై స్పష్టమైన అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడట. ఇలాంటి టైమ్ లో సినిమాలంటూ వెళితే డీవియేట్ అవుతా అనుకుంటున్నాడని సమాచారం. ఈ విషయం అర్థమయ్యే ఉస్తాద్ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గానే ప్రకటించాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిన తర్వాతే హరీశ్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ స్టార్ట్ చేసి పూర్తి చేశాడు. ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ టీజర్ లాంచ్ లోనే తన నెక్ట్స్ మూవీ రామ్ పోతినేనితో ఉంటుందని చెప్పాడు. మరి ఉస్తాద్ మేటర్ ఏంటీ అంటే అది నిర్మాతలనే అడగాలి అన్నాడు. సో.. ఉస్తాద్ వస్తుందా రాదా అన్న క్లారిటీ ఇప్పటికే మీకూ వచ్చి ఉండాలి. వస్తే.. హరీశ్ శంకర్ పవర్ ఫుల్ రైటప్ లో పవన్ కళ్యాణ్ ను వెండితెరపై చూస్తాం.. లేదంటే ఆ డేట్స్ లో పవర్ ఫుల్ స్పీచెస్ తో అసెంబ్లీలో, ప్రెస్ మీట్స్ లో చూస్తుంటాం.. అంతే సంగతి.

Tags

Next Story