Tollywood: పవన్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్..

Tollywood: పవన్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్..
X
Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం తగ్గట్లేదు.. పవన్ సినిమా ఏదైనా వస్తుందంటే అభిమానుల్లో హడావిడి అంతా ఇంతా కాదు..

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం తగ్గట్లేదు.. పవన్ సినిమా ఏదైనా వస్తుందంటే అభిమానుల్లో హడావిడి అంతా ఇంతా కాదు.. ఇక ఇప్పుడు మరి అతడి సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్ నుంచి సీక్వెల్ వస్తుందంటే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సహం. ఈ సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. అప్పట్లో చిత్ర నిర్మాత దీనికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు కానీ మళ్లీ ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయం తెరపైకి వచ్చింది. ట్విట్టర్ వేదికగా దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ రెండో భాగానికి కసరత్తు జరుగుతోందని సంకేతం ఇచ్చారు.

ఇప్పటికే పవన్ చేస్తున్న రెండు సినిమాలు పూర్తయిన తరువాతే వకీల్ సాబ్ 2 గురించి ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే పవన్ రానున్న ఎన్నికల దృష్ట్యా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండడంతో జనసేన అధినేత ఫోకస్ సీరియస్‌గా ఉంది. నిధుల కోసమే సినిమాలు చేస్తున్నా అని పవన్ చెప్పినా, మరి ఈ సమయంలో జనంలో ఉండడం చాలా అవసరం.. షూటింగ్‌లో ఉంటూ సినిమాలు చేసుకుంటే అటు సినిమా రిజల్ట్, ఇటు రాజకీయ రిజల్ట్ కూడా బెడిసి కొడుతుంది. దాంతో పవన్ ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ చూసుకుంటే వకీల్ సాబ్ 2 ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లే.

Tags

Next Story