సైదాబాద్ అత్యాచారం ఘటన: : చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్..!

సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.. సైదాబాద్ సింగరేణి కాలనీలోని బాధితురాలి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.. పవన్ అక్కడకు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.. అభిమానులు ఎగబడటంతో పవన్ కొద్దిసేపు కారులోనే ఉండిపోయారు.
కారు దిగే పరిస్థితి లేకపోవడంతో చివరకు పోలీసుల సాయంతో చిన్నారి తల్లిదండ్రులను తన కారు వద్దకు పిలిపించుకున్నారు పవన్ కల్యాణ్.. వారికి ధైర్యం చెప్పారు.. చిన్నారి హత్య కలచివేసే సంఘటన అన్నారు జనసేనాని.. సభ్య సమాజంలో మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటనగా చెప్పారు.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని, పోరాడుతుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/LeQdU1ftAB
— JanaSena Party (@JanaSenaParty) September 15, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com