Kingdom : పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ దేవరకొండ.. క్లాష్ తప్పడం లేదా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఢీ కొట్టబోతోందా..? ఈ ఇద్దరి మధ్యా క్లాష్ తప్పదా అంటే తప్పడం లేదు అనే అంటున్నారు సినీ జనం. నిజానికి మే 30 నుంచి ఈ రెండు సినిమాలు ఢీ కొంటాయి అనే టాక్ ఉంది. తర్వాత హరిహర వీరమల్లు జూన్ 12కి వస్తుందన్నారు. బట్ ఆ డేట్ నుంచి కూడా పోస్ట్ పోన్ అయింది. ఇటు కింగ్ డమ్ కూడా మే 30 నుంచి తప్పుకుంది. కొత్త డేట్ గా జూలై 4 అన్నారు. బట్ ఆ డేట్ కూ రావడం లేదు. ఫైనల్ గా ఇప్పుడు జూలై 25కి ఫిక్స్ అయిందంటున్నారు. అయితే అదే డేట్ కు హరిహర వీరమల్లును కూడా విడుదల చేయాలనుకుంటున్నారు అనేది లేటెస్ట్ టాక్. దీంతో రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదు అంటున్నారు. కాకపోతే ఇక్కడో విషయం ఏంటంటే.. కింగ్ డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీకి, పవన్ కళ్యాణ్ తో మంచి రాపో ఉంది. ఆ కారణంగా తన సినిమాను ఆయన వాయిదా వేస్తారు అనేది. బట్ అందుకు ఛాన్స్ లేకండా ఈ ఇద్దరి మధ్యలోకి ఓటిటి ప్లాట్ ఫామ్స్ దూరాయి.
హరిహర ఓటిటి రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. కింగ్ డమ్ ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడీ రెండు ప్లాట్ ఫామ్స్ ఖచ్చితంగా జూలై 25కే తమ సినిమాలను విడుదల చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నాయి. ఓటిటి వాళ్లు పట్టుబడితే నిర్మాతలు ఏం చేయడానికి లేని పరిస్థితి వాళ్లే తెచ్చుకున్నారు. అందుకే రెండు సినిమాలూ ఒకే డేట్ కు వస్తున్నాయి అనేది స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఒకవేళ సినిమా పెద్దలు ఓటిటి వారిని కన్విన్స్ చేయగలిగితే.. కింగ్ డమ్ మరోసారి వాయిదా పడుతుందని వేరే చెప్పక్కర్లేదు. కాకపోతే వాళ్లు ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. మళ్లీ అంటే అది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతుంది. అందుకే పవన్ తో ఢీ కొట్టేందుకే రెడీగా ఉన్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాకపోతే ఎవరో ఒకరోజు ముందుగా .. జూలై 24న రావొచ్చట. సో.. పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ దేవరకొండ అనే పోటీ తప్పేలా లేదు అనే అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com