pawan kalyan : సముద్రఖనికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..!
pawan kalyan : పవన్ కళ్యాణ్ మరో రీమేక్ పైన కన్నేశాడని తెలుస్తోంది.. తమిళ చిత్రం వినోదయ సితం సినిమాని పవన్ రీమేక్ చేయనున్నట్టుగా ఫిలింనగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

pawan kalyan : పవన్ కళ్యాణ్ మరో రీమేక్ పైన కన్నేశాడని తెలుస్తోంది.. తమిళ చిత్రం వినోదయ సితం సినిమాని పవన్ రీమేక్ చేయనున్నట్టుగా ఫిలింనగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. తమిళ్ లో సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా అక్టోబర్ 13న ZEE5 ఓటీటీలో రిలీజై విమర్శల ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాని చూసిన పవన్.. తెలుగులో రీమేక్ చేయాలనీ భావించారట. ఒరిజినల్ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సముద్రఖనికి ఇది బంపర్ ఆఫర్ అన్నట్టే.. సముద్రఖని ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్ లలో ఒకరు.
తెలుగులో శంభో శివ శంభో సినిమాకి దర్శకత్వం వహించి ఆకట్టుకున్నాడు సముద్రఖని.. అటు పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి ఇది రీమేక్.
ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 12, 2022న విడుదల కానుంది. ఈ సినిమా తరవాత క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకి కమిట్ అయ్యాడు పవన్.
RELATED STORIES
Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్
19 Aug 2022 10:45 AM GMTManish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ...
19 Aug 2022 10:07 AM GMTKakinada: కాకినాడ జిల్లాలో యువతి మిస్సింగ్.. అయిదు రోజులుగా..
18 Aug 2022 3:15 PM GMTHyderabad: సోషల్ మీడియా పరిచయం.. ఆపై ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు...
18 Aug 2022 12:15 PM GMTBihar: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కాల్పులు.. మెడలోకి దూసుకెళ్లిన...
18 Aug 2022 10:50 AM GMTVasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటీ దాడులు..
17 Aug 2022 4:00 PM GMT