Pawan Kalyan: ఎఫ్ 2 లాంటి కథ కావాలంటున్న పవర్ స్టార్..

Pawan Kalyan (tv5news.in)
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తన స్టైల్, మ్యానరిజమ్, ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే డ్యాన్స్.. ఇవన్నీ ఆశిస్తారు అభిమానులు. పవన్ కూడా ఇప్పటివరకు దానికి తగినట్టుగానే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత పవన్ స్క్రిప్ట్ సెలక్షన్‌లో స్టైలే మారిపోయింది. ఇకపై హీరో, విలన్ ఇలాంటి సినిమాలు చేయడానికి పవన్ ఆసక్తి చూపించట్లేదట.
పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌తో తన కెరీర్‌లో కొత్త చాప్టర్‌ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు పవన్ కెరీర్‌లో చేసిన సోషల్ మెసేజ్ సినిమాలు చాలా తక్కువ. అందులో వకీల్ సాబ్ తన ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాస్త కొత్త యాసతో, స్టైలిష్ లుక్స్‌తో పవన్ అదరగొట్టేశాడు. అంతే కాకుండా 'హరిహర వీరమల్లు'తో తొలిసారి పీరియాడిక్ డ్రామా జోనర్‌ను కూడా టచ్ చేయనున్నాడు. అదే విధంగా త్వరలోనే మరో కొత్త ప్రయోగానికి పవన్ ఓకే చెప్పారట.
కామెడీ సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ హీరోలు కామెడీ చేయడాన్ని ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే పవన్ కూడా ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. వీటి తర్వాత చేయడానికి ఒక కామెడీ స్క్రిప్ట్‌ను వెతికే పనిలో పడ్డారట పవన్.
ఎఫ్ 2 లాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం దానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎఫ్ 3 తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేయనున్నాడన్న విషయంపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అయితే పవన్‌తో సినిమా చేయాలన్న కోరికతో ఆయనను వెళ్లి అడగగా ఎఫ్ 2 లాంటి కామెడీ కథను సిద్ధం చేయమని పవన్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తు్న్నాయి. పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వెయిటింగ్ తప్పదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com