Pawan Kalyan : పవన్ కొత్త రీమేక్.. 20 రోజుల డేట్స్.. 50 కోట్ల రెమ్యునరేషన్..?

Pawan Kalyan : వకీల్‌సాబ్, భీమ్లానాయక్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భీమ్లానాయక్ చిత్రం తరవాత క్రిష్‌తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలను ఫినిష్ చేయాల్సి ఉంది పవన్.
అయితే ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మరో రీమేక్‌ని లైన్‌లో పెట్టాడట పవన్... . తమిళ చిత్రం వినోదయసితం సినిమాని పవన్ రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ్‌లో సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అయితే ఈ సినిమాని తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేయాలని పవన్ భావిస్తున్నారట. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందట.. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించారని, సినిమాకి గాను 50 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటుగా పవన్‌కి లాభాల్లో వాటా ఇచ్చేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓకే చెప్పినట్టుగా సమాచారం.
ఈ సినిమాకి సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ జరుగుతుందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com