Bheemla Nayak : పవన్ ఫ్యాన్స్ కి షాక్.. భీమ్లానాయక్ కి షాకింగ్ టీఆర్పీ..!

Bheemla Nayak : పవన్ ఫ్యాన్స్ కి షాక్.. భీమ్లానాయక్  కి షాకింగ్ టీఆర్పీ..!
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు.

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథనం, మాటలు అందించారు. నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్ పై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది.

తాజాగా టీవీలో ప్రసారం అయ్యింది. స్టార్ మాలో గత ఆదివారం మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయిన భీమ్లానాయక్ చిత్రం షాకింగ్ టీఆర్పీని అందుకుంది. SDలో 9.1 టీఆర్పీని మరియు HD+SDలో 10 టీఆర్పీని అందుకొని ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది.

బన్నీ అల వైకుంఠపురంలో 29.4, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 23.4తో అత్యధిక టీఆర్‌పీలను నమోదు చేస్తే పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ కనీసం రెండు అంకెల మార్కును కూడా టచ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్న హరి హర వీర మల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నిధిఅగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story