Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా హరిహర వీరమల్లు రికార్డ్ క్రియేట్ చేసింది. అఫ్ కోర్స్ ఈ రికార్డ్ కూడా త్వరలోనే కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఏ అంచనాలూ లేని ఈ చిత్రానికే బెస్ట్ ఓపెనింగ్స్ అంటే ఎప్పటి నుంచో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ‘ఓ.జి’ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయొచ్చు. ఇక క్రిష్ కొంత భాగం, జ్యోతికృష్ణ కొంత భాగం డైరెక్ట్ చేసిన హరిహర వీరమల్లుకు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పరమ నాసిరకంగా ఉన్నాయంటున్నారు. ఇది సినిమా ఓవరాల్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించొచ్చేమో కానీ.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. అందుకు కారణం ఏపిలో టికెట్ ధరలు కూడా అని చెప్పాలి. ఈ చిత్రానికి అక్కడ ఏకంగా 700 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు. దీంతో పాటు రిలీజ్ ముందు రోజు నైట్ నుంచే షోస్ పడ్డాయి. ఈ కారణంగా హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా హరిహర వీరమల్లు 45 కోట్ల వరకూ వసూళ్లు వచ్చాయి. ఇదే ఇప్పటి వరకూ పవన్ కెరీర్ లో హయ్యొస్ట్ నంబర్. అంతకు ముందు వకీల్ సాబ్ కు 40 కోట్లు వసూళ్లు వచ్చాయి. తర్వాత నంబర్ ఇదే. ఈ నంబర్ ను ఓ.జి దాటేస్తుందని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ రిలీజ్ రోజునే సక్సెస్ మీట్ కు అటెండ్ అయ్యాడు. ఉత్సాహంగా మాట్లాడాడు. ఏదేమైనా కంటెంట్ ఓకే అనిపించేలా ఉన్నా.. దర్శకత్వం, టెక్నికల్ గా వీక్ గా ఉండటం హరిహర వీరమల్లుకు పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com