Gabbar Singh : పదేళ్ళ గబ్బర్ సింగ్... వద్దు అనుకుంటూనే సినిమాని చేసిన పవర్ స్టార్...!

Gabbar Singh : పదేళ్ళ గబ్బర్ సింగ్... వద్దు అనుకుంటూనే సినిమాని చేసిన పవర్ స్టార్...!
Gabbar Singh :బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్‌' సినిమాకు ఇది రీమేక్‌ .. ముందుగా ఈ సినిమాని చూసిన పవన్ కళ్యాణ్ తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు..

Gabbar Singh : మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ ముద్రని కొద్దిరోజుల్లోనే చెరిపేసి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తమ్ముడు, బద్రి, ఖుషి మూవీలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ కి సినిమా సినిమాకి ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది.. జానీ నుంచి ఓ పదేళ్ళ పాటు వరుస ఫ్లాప్లు వచ్చిన ఇమేజ్ కానీ ఫాలోయింగ్ కానీ ఎక్కడ కూడా చెక్కుచెదరలేదు.. ఇంకా చెప్పాలంటే పెరిగింది కూడా ... పదేళ్ళ కాలంలో వరుస ప్లాప్స్ తర్వాత ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని సగటు అభిమాని కాలర్ ఎగరేసి మూవీ వచ్చింది.. అదే గబ్బర్ సింగ్... 2012 మే 11న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్‌' సినిమాకు ఇది రీమేక్‌ .. ముందుగా ఈ సినిమాని చూసిన పవన్ కళ్యాణ్ తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎలాగైనా చేయాల్సిందే తప్పదని అనుకుంటూనే ఈ సినిమాని చేశారు పవన్..

♦ ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండాలో, టైటిల్ ఏంటో అన్ని పవన్ ముందుగానే డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇచ్చారు.

♦ రవితేజతో చేసిన మిరపకాయ్ మూవీ ముందుగా పవన్ తోనే చేద్దామని అనుకున్నారు హరీష్.. అప్పుడు ఆ కథకి అనుకున్న టైటిల్ రొమాంటిక్ రిషి.. కానీ కొన్ని కారణాల వల్ల పవన్ ఈ సినిమా చేయలేకపోయారు.. కానీ మరో సినిమాకి ఛాన్స్ ఇస్తానని చెప్పారు.. అలా గబ్బర్ సింగ్ సెట్ అయింది.

♦ పవన్ ఇచ్చిన ఇన్ పుట్స్ తో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి ఓ కొత్త స్క్రిప్ట్ ని రెడీ చేశారు హరీష్.. కబడ్డీ, అంతాక్షరి సీన్స్ పవన్ ఇచ్చిన ఐడియాలు..

♦ గబ్బర్‌సింగ్‌ అనే టైటిల్ పెట్టడానికి హైదరాబాదులోని ఓ పోలీస్ ఆఫీసర్ పవన్ కి స్ఫూర్తి.. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర కూడా పొలీస్ కావడంతో అతని పేరునే టైటిల్ గా పెట్టారు పవన్.

♦ ముందుగా ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్ లేదా పీకే ఎంటర్ టైన్మెంట్ లో చేయాలని అనుకున్నారు పవన్.. కానీ చివరికి బండ్ల గణేష్ కి ఛాన్స్ ఇచ్చారు.

♦ హీరోయిన్ గా ఇలియానా, పార్వతి మెల్టన్, నథాలియా కౌర్ ని అనుకున్నారు.. ఫైనల్ గా వరుస ప్లాప్ లతో ఉన్న శృతిహాసన్ ని తీసుకున్నారు.

♦ హీరో తండ్రి పాత్రకి కృష్ణంరాజు, నందమూరి హరికృష్ణలలో ఒకరిని అనుకున్నారు. చివరికి నాగినీడుని తీసుకున్నారు.. ఇక తమ్ముడి పాత్రకి శ్రీకాంత్, సుశాంత్ లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు కానీ ఫైనల్ గా అజయ్ ని సెలెక్ట్ చేశారు.

♦ విలన్ గా దబాంగ్‌ లో నటించిన సోనూసూద్ రిపీట్ చేయాలని అనుకున్నారు కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో అభిమన్యు సింగ్ ని తీసుకున్నారు.

♦ ఐటెం సాంగ్ కోసం అనుష్కని తీసుకోవాలని అనుకున్నారు.. ఫైనల్ గా దబాంగ్‌ లో చేసిన మలైకాకే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి ఫైనల్ చేశారు.

♦ పొల్లాచ్చి, గుజరాత్, హైదరాబాదు, విజయవాడలలో చిత్రికరించారు..

♦ నాకు కొంచెం తిక్క ఉంది, కాని దానికో లెక్క ఉంది అనే డైలాగ్ ముందుగా పవన్ కి చెప్పడానికి హరీష్ శంకర్ బయపడ్డారు... కానీ పవన్ విన్నాక మాత్రం చాలా సేపు నవ్వుకున్నారు.

♦ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఒక్కో సాంగ్ ఆటమ్ బాంబ్ లాగా పేలింది.. అప్పుడు ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా ఇవ్వే పాటలు..

♦ శిల్పకళావేదిక వేదికలో ఆడియో ఫంక్షన్ జరగగా పవన్ అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు.

♦ ముందుగా ఈ సినిమాని 2012 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న అనుకోని చివరికి ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్లలో 11 మే 2012న విడుదలైంది.

♦ రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 150 కోట్లు వసూళ్లు చేసింది.

♦ ఈ చిత్రం 306 కేంద్రాల్లో 50 రోజులకుపైగా, 65 కేంద్రాల్లో 100 రోజులకుపైగా ప్రదర్శితమై, రికార్డు నెలకొల్పింది.

♦ ఈ సినిమాకి మరింత ప్రమోషన్ చేద్దామని దర్శకుడు హరీష్ పవన్ ని కోరితే..సక్సెస్ కనిపిస్తుంది మనం కనిపించాల్సిన అవసరం లేదని అన్నారట .. ఇదే లైన్ తో దువ్వాడ జగన్నాధం అనే సినిమాని తీశారు హరీష్.

♦ గబ్బర్ సింగ్ సినిమా చూశాక ఇలాంటి సినిమా తనకి కదా రావాల్సింది అని చిరంజీవి అనుకున్నారట.

♦ ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన గబ్బర్ సింగ్ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story