Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ.జి .. ఇదేం విడ్డూరం

పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఓ.జి. ఈ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. పవన్ ను చూపించిన విధానానికి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. పవన్ కూడా దర్శకుడికి ఓ కాస్ట్ లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. సుజీత్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ క్యారెక్టర్స్ పరంగా కూడా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఓ.జి అతని కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిపోయింది. తర్వాత ఈ మూవీ ఓటిటిలో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ ఓటిటిలో సైతం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలాంటి మూవీ ఇప్పుడు శాటిలైట్ లో కూడా ప్రసారం కాబోతోంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
ఈ మూవీ టివిల్లో ప్రసారం కాబోతోంది. కాకపోతే అది హిందీలో. యస్.. జనవరి 10నాడు స్టార్ గోల్డ్ లో రాత్రి 8 గంటలకు ఈ మూవీ హిందీలో ప్రసారం కాబోతోంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు అంటే మాత్రం అదీ క్లారిటీ లేదు అని చెబుతున్నారు. తెలుగు కంటే ముందు హిందీలో ప్రసారం కావడం ఏంటీ అనేది మాత్రం తెలియలేదు. మరి తెలుగులో ఎప్పుడు ప్రసారం అవుతుంది అనేది మాత్రం త్వరలోనే తెలియజేస్తారట. కాకపోతే తెలుగు సినిమాను ముందుగా హిందీలో ప్రసారం చేయడం ఏం విడ్డూరమో మరి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

