Pawan Kalyan : టాలీవుడ్ కోసం పవన్ కళ్యాణ్ పంచసూత్రాల రూల్

టాలీవుడ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు పరిశ్రమకే ఇబ్బందులు తెచ్చాయి. కొందరి అత్యుత్సాహం వల్ల మొత్తం ఇండస్ట్రీకి, ఏపిలో థియేటర్స్ మనుగడకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేసుకున్నారు అనేది అందరికీ తెలిసింది అన్నారు. దీంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఎంతో చేస్తూ వచ్చిన డిప్యూటీ సిఎమ్ పవన్ కు కోపం వచ్చింది. అంతే.. ఓ పేద్ద లెటర్ విడుదల చేసి ఎంటైర్ టాలీవుడ్ కు వణుకు తెప్పించాడు. అతని ఆగ్రహానికి దిల్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ కూడా.. ‘పవన్ కళ్యాణ్ పెద్దన్నలాంటి వాడు.. తిడితే పడతాం’అనేశాడంటే ఆ లెటర్ ఎఫెక్ట్ ఏ స్థాయికి వెళ్లబోతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే పవన్ అంతటితో ఆగలేదు. ఓ ఆరు సూత్రాల కొత్త రూల్ తెస్తూ.. టాలీవుడ్ ను సంస్కరించబోతున్నాను అనే సూచనలు పంపించాడు. ఇవన్నీ కూడా థియేటర్స్ లో సమస్యలను పరిష్కరిస్తూ.. టికెట్ ధరలను స్థిరీకరిస్తూ ఉండటంతో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లకు కూడా కొత్త తలనొప్పులు రాబోతున్నాయి. మరి పవన్ ప్రకటించిన ఆ ఆరు సూత్రాలూ ఏంటో తెలుసా..?
1. టికెట్ ధరల నియంత్రణ :
ఇకపై అన్ని టికెట్ ధరల పెంపు రిక్వెస్ట్ లన్నీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే జరగాలి. అందుకు హరిహర వీరమల్లు కూడా మినహాయింపు కాదు.
2. ఫుడ్, డ్రింక్స్ ధరలను నియంత్రించడం
దీని ద్వారా ఇకపై అన్ని థియటర్స్ లో విక్రయిస్తోన్న ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ను సంబంధించిన ధలరను నియంత్రణ ప్రభుత్వమే చేస్తుంది. అలాగే క్వాలిటిని చెక్ చేస్తూ మోనోపలీస్ ను అడ్డుకట్ట వేయబోతోంది.
3. న్యాయమైన పద్ధతుల్లో పరిశ్రమను ఉంచడం
ఇకపై ఎలాంటి బెదిరింపులు ఒత్తడిలు ఉండవు. పారదర్శకమైన, గౌరవప్రదమైన సినిమా వ్యాపారాలు జరిగేలా చూడటం ప్రభుత్వమే చేస్తుంది.
4. థియేటర్ల బంద్ వ్వవహారం
థియేటర్స్ ను బంద్ చేయాలనే నిర్ణయాల వెనక ఉన్నవారిపై విచారణ కమిటీ వేయడం. ఇందులో రాజకీయ, వ్యక్తిగత వ్యక్తులు ఉన్నా ఉపేక్షించబోం అనే సందేశం ఉంది.
5. సరికొత్త సినిమా పాలసీ
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కొత్త డ్రాఫ్ట్ కమిటీని నియమించడం. ఇందులో పరిశ్రమలోని సంఘాల సలహాలూ, సూచనలూ తీసుకుంటుంది.
‘వీటితో పాటు థియేటర్స్ ను రెగ్యులేట్ చేయడం. ముఖ్యంగా ఆడియన్స్ సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ రూల్స్ ను ఎవరైనా అతిక్రమిస్తే పార్టీలు, వ్యక్తులకు అతీతంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం..’ అంటూ మరోసారి టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ తో కూడిన నిర్ణయాలను ప్రకటించాడు.
మరి వీటికి టాలీవుడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కానీ.. ఒకవేళ వీటిని ఇప్పటికిప్పుడు అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జిబిటర్స్ తో పాటు నిర్మాతలకు వెంటనే సమస్యలు తప్పవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com