Ustaad Bhagat Singh Update : పవన్ కల్యాణ్ ఉస్తాద్ అప్ డేట్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏడాది కిందట వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అయితే, ఆ తర్వాత ఏపీ ఎన్నికలు జరగడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ‘ఉస్తాద్’ షూటింగ్ కు బ్రేక్ లు పడ్డాయి. తాజాగా ఆ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన రవిశంకర్ ‘ఉస్తాద్’పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘ఇటీవల పవన్‌ను మీట్ అయ్యా. తొందరలోనే ఉస్తాద్ భగత్‌సింగ్‌షూటింగ్‌ను ప్రారంభించనున్నాం. డిసెంబర్, జనవరిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేస్తాం. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజ్ కన్ఫామ్ గా ఉంటుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. రవిశంకర్ ఇచ్చిన అప్ డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ‘ఉస్తాద్’ సర్ ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com