Pawan Kalyan Gabbar Singh : గబ్బర్ సింగ్ హంగామా మొదలైంది

Pawan Kalyan Gabbar Singh :  గబ్బర్ సింగ్ హంగామా మొదలైంది
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆ టైమ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మూవీ గబ్బర్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ కు రీమేక్. కానీ పూర్తిగా హరీశ్ శంకర్ స్టైల్లో కనిపిస్తుంది. పవన్ కు అంతకు ముందు డజనుకు పైగా ఫ్లాపులు ఉన్నాయి. కాకపోత జల్సా కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది. ఆ టైమ్ లో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి మూవీని పవన్ బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే హీరోయిన్ శృతి హాసన్ కు ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ కూడా తన ఫేవరెట్ హీరోకు బ్లాక్ బస్టర్ ఇచ్చాను అని గర్వంగా ఫీలయ్యేలా చేసింది గబ్బర్ సింగ్. ఎలా చూసినా ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మూవీలో. అలాంటి మూవీని రీ రిలీజ్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉంటుందా.. యస్.. అందుకు తగ్గట్టుగా రెండు మూడు రోజులు ముందు నుంచే హడావిడీ మొదలుపెట్టేశారు. ఆల్రెడీ చాలా థియేటర్స్ లో గబ్బర్ సింగ్ ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమానులు బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈ మూవీకి రికార్డ్ కలెక్షన్స్ కట్టబెట్టేలా ప్రయత్నాలూ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సి.ఎమ్ గానూ ఉన్నాడు పవన్. అందువల్ల ఏపిలో ఇంకా ఎక్కువ సందడి కనిపించొచ్చు. అలాగే వారికి ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణ అభిమానులు కూడా ప్లానింగ్స్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అనేది పక్కన బెడితే రెండు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు గబ్బర్ సింగ్ సాక్షిగా చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని మాత్రం తెలుస్తుంది. అసలింతకీ.. పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎప్పుడో తెలుసు కదా..? యస్.. సెప్టెంబర్ 2న. ఆ రోజు పవన్ నామస్మరణతో రెండు తెలుగు రాష్ట్రాలూ మార్మోగిపోతాయన్నమాట.

Tags

Next Story