Pawan Kalyan : ఉస్తాద్ తో పవన్ సినీ ప్రయాణం ముగిసినట్టేనా..?

పవన్ కళ్యాణ్ సినిమా ప్రయాణానికి శుభం కార్డ్ పడినట్టే అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. అది అతను కూడా ఒప్పుకున్నాడు. ఇకపై సినిమాలు చేయను. కావాలంటే నిర్మిస్తాను అనేలా ఆ మధ్య హరిహర సినిమా ఫంక్షన్ లో చెప్పాడు. అందుకే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ చకచకా పూర్తి చేశాడు. హరిహర వీరమల్లు విడుదలైంది. ఓ.జి షూటింగ్ అయిపోయింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి చేశాడు. అత్యంత బిజీగా ఉండి కూడా తమ సినిమాను కంప్లీట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ నిర్మాణ సంస్థ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
తమిళ్ లో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంత తక్కువ టైమ్ లో సినిమా ఎలా పూర్తి చేశాడా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ అయిన టైమ్ లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మేజర్ పార్ట్ ను చిత్రీకరించాడట హరీష్ శంకర్. అందుకే చాలా తక్కువ పోర్షన్ మిగిలిపోయింది. దాన్నే తక్కువ టైమ్ లోనే పూర్తి చేశాడు. ఇక మొదట్లో ఈ ప్రాజెక్ట్ లో రాశిఖన్నా లేదు. తను ఈ మధ్యే జాయిన్ అయింది. ఆమెకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. శ్రీ లీల పాత్ర కూడా మారింది. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ తో నటుడుగా పవన్ కళ్యాణ్ ప్రయాణం ముగిసిపోయినట్టే అని భావించొచ్చు. వెండితెరపై అతని చివరి సినిమా ఇదే అవుతుందా లేక మనసు మార్చుకుంటాడా అనేది చూడాలిక.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com