Payal Rajput: ఆ ట్రోల్స్ వల్ల నా కుటుంబం ఇబ్బంది పడింది: పాయల్ రాజ్‌పుత్

Payal Rajput (tv5news.in)
Payal Rajput: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల తన 29వ ఏట అడుగుపెట్టింది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చిన పనిని నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లిపోయే మెంటాలిటీ తనది. ఇందు లాంటి పాత్ర చేసిన తర్వాత ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివిటీ వస్తుందని తెలిసినా పాయల్.. 'ఆర్ ఎక్స్ 100' సినిమా చేయడానికి ఒప్పుకుని.. దాని సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.
ఇందు క్యారెక్టర్ చేసిన తర్వాత నుండి పాయల్‌కు కొందరు ప్రేక్షకుల నుండి నెగిటివిటీ ఎదురవుతోంది. అయినా తాను ఇప్పటివరకు ఏదీ పట్టించుకోలేదు. ఫోటోషూట్స్‌తో, వెబ్ సిరీస్‌తో ప్రస్తుతం పాయల్ కెరీర్ చాలా బిజీగా గడిచిపోతోంది. అయితే ఓ ఫోటోషూట్ వల్ల తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై పాయల్ తొలిసారి స్పందించింది.
ఇటీవల యెల్లో కోట్‌లో సెమీ న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొంది పాయల్ రాజ్‌పుత్. అందులో జరిగిన ఓ పొరపాటు వల్ల ప్రస్తుతం తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. దీనిపై తాను స్పందిస్తూ.. ఫోటోషూట్స్ అన్నాక పొరపాట్లు జరుగుతూ ఉంటాయని చెప్పింది. ఈ ట్రోల్స్ వల్ల తానే కాకుండా తన కుటుంబం కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.
ఫోటోషూట్‌పై వస్తున్న ట్రోలింగ్స్‌ను చూసి తన తల్లి తనను ఇంటికి తిరిగి వచ్చేయమని కోరినట్టు చెప్పింది పాయల్ రాజ్‌పుత్. కానీ ఇలాంటి వల్ల తాను బెదరనని, వీటిని ఎదుర్కునే శక్తి తనకు ఉందని తల్లికి చెప్పినట్టు తెలిపింది. పాయల్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ లైఫ్‌ను గడిపేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com