Pedda Kapu - 1 Trailer : శ్రీకాంత్ అడ్డాల వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అనౌన్స్ మెంట్

'నారప్ప' లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు 'పెద్ద కాపు - 1'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఓ సామాన్యుడి సంతకం అనే ఇంట్రస్టింగ్ క్యాప్షన్ తో రాబోతున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు ట్రైలర్ లాంఛ్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల వాయిస్ ఓవర్ తో సాగే ఈ వీడియోలో.. చివరగా... 'పెద్ద కాపు -1' ట్రైలర్ ను సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
"భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు భగవంతుడే అంతా తానై ఉన్నపుడు ఇక ధర్మం ఏంటీ.. అధర్మం ఏంటీ.. పుణ్యం ఏంటీ.. పాపం ఏంటీ.. మరి మనిషి అనుభవం మాట, సామాన్యుడికి తగిలే దెబ్బల మాట.. సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలనే అనుకుంటాడు.. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలనుకునే వాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారే మూసేసి తొక్కెయ్యాలనుకునే వాడికి మధ్య యుద్దం తప్పదు. సెప్టెంబర్ 29న చూద్దాం. పెద్ద కాపు.. ఓ సామాన్యుడి సంతకం" అంటూ శ్రీకాంత్ అడ్డాల తన వాయిస్ ఓవర్ తో మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.
ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్.. సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ తో ప్రారంభమైంది. "తెలుగు జనతకు వందనం. వెనకబడిన తరగతిని ఇంకా ఇంకా అట్టడగు తొక్కి వేయబడుతుంటే శిక్షించలేక, రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకై, దగాకోరు విధానమై, ఆంధ్రా ఆత్మాభిమానం చంపుతుంటే మీ కోసం వచ్చా"నంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని 'అఖండ'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతోంది.
ఈ సినిమాతో రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 29న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Every voice raised becomes a common man’s signature ✍️✊🏻#PeddhaKapu1 Theatrical Trailer Out On Sept 11th! 💥@ViratKarrna @officialpragati @SrikanthAddala_ @MickeyJMeyer @Editormarthand @NaiduChota @anusuyakhasba @mravinderreddyy @dwarakacreation @shreyasgroup… pic.twitter.com/1GZ3SPXn9x
— Shreyas Media (@shreyasgroup) September 9, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com