Peddha Kapu - 1 : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది

రీసెంట్ గా రిలీజైన 'పెదకాపు 1' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన ఈ మూవీలో విరాట్ కర్ణ వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ విషయానికొస్తే.. ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్స్ లో జనాల్ని మెప్పించలేకపోయిన మూవీ ఓటీటీలో అయినా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. మొదటి భాగమే ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు సీక్వెల్ సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' సీక్వెల్ తెరకెక్కిస్తారా? లేక ఆపేస్తారా? అనేది చూడాలి. కెరియర్ ఆరంభంలో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాస్ మూవీస్ తో దర్శకుడిగా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత 'నారప్ప' లాంటి ఊరమాస్ మూవీని తీసి దర్శకుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఆ తర్వాత తెరకెక్కించిన 'పెదకాపు 1' మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో చాలామంది విశ్లేషకులు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ పై విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రావు రమేష్, రాజీవ్ కనకాల, బ్రిగిడ సాగ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకతేంటంటే.. ఇందులో శ్రీకాంత్ అడ్డాల విలన్ రోల్ పోషించారు. అయితే రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ ఫ్లాట్ బాగున్నా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో సెప్టెంబర్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.
#PeddhaKapu1 A 𝐂𝐎𝐌𝐌𝐎𝐍 𝐌𝐀𝐍 Rise against the System 🔥
— Dwaraka Creations (@dwarakacreation) October 27, 2023
Streaming Now on @PrimeVideoIN 💥 👉https://t.co/jOeOrEXyWo@ViratKarrna @SrikanthAddala_ @officialpragati @MickeyJMeyer @Editormarthand @NaiduChota @anusuyakhasba @mravinderreddyy @dwarakacreation pic.twitter.com/ftFRf0ySzZ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com