Peddi second single : పెద్ది సెకండ్ సింగిల్ వస్తోంది..

Peddi second single :  పెద్ది సెకండ్ సింగిల్ వస్తోంది..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మళ్లీ ఆ స్థాయిలో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. అందుకే అంచనాలు చాలా పెద్దగా ఉన్నాయి ఈ మూవీపై. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ సింప్లీ సూపర్బ్ అనిపించుకుంది. తర్వాత వచ్చిన పాట అద్దిరిపోయింది అనిపించుకుంది. చాలాకాలం తర్వాత ఏఆర్ రహమాన్ తెలుగు సినిమాకు సంగీతం చేస్తున్నాడు. అందుకే ఫస్ట్ సాంగ్ తో అదరగొట్టాడు.

ఇక పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ కు టైమ్ వచ్చింది. రై రై రా రా అంటూ సాగే పాట ఇది. ఈ పాటను మార్చి 2న విడుదల చేయబోతున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో అనుకుంటున్నారు ఆడియన్స్. బట్ ఈ పాట మరో రేంజ్ లో ఉండబోతోంది అనిపించేలా ఉందట. ఓ రకంగా ఇది పెద్ది ఆంథెమ్ లాంటి పాటగా కూడా ఉండబోతోందట. గ్రిట్, గట్స్ అండ్ గ్లోరీతో కూడిన ఆంథెమ్ అది అని చెబుతున్నారు. అంటే ఈ సారి పాటలో కూడా జాన్వీ కపూర్ పూర్తి స్థాయిల్ హైలెట్ అయ్యే అవకాశాలు లేవు అని చెప్పొచ్చు.

Tags

Next Story