Peddi trailer : పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్ది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రెండు డిఫరెంట్ గెటప్స్ తో పాటు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడని ముందే అర్థమైంది. ఆల్రెడీ వచ్చిన రెండు గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచిపోయాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల డేట్స్ వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఆ డేట్ ను ఫిక్స్ చేసింది మూవీ టీమ్.
జూన్ 4న విడుదల కాబోతోన్న పెద్ది ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ట్రైలర్ ను మాత్రం ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ పోస్టర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్లేస్ లో మెగా పవర్ స్టార్ మాత్రమే ఉండటం విశేషం అనే చెప్పాలి. మొత్తంగా అదే రోజు ఏ టైమ్ కు ట్రైలర్ వస్తుంది అనేది కూడా చెబితే బావుండేది. అయితేనే మే 18న ట్రైలర్ రావడం ఖాయం అయిపోయింది. ఇక ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిందీ మూవీలో. తను ఓ ఎమ్మెల్యే కూతురుగా కనిపించబోతోందట. అలాగే శ్రుతి హాసన్ ఓ ఐటమ్ సాంగ్ లో ఓ రేంజ్ లో చిందేసింది అని టాక్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ఎసెట్ అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
