Ram Charan : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Ram Charan :  పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
X

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్ తో పాటు ఒక పాట కూడా సోషల్ మీడియాను ఊపేసింది. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు అనేది మాత్రం క్లారిటీగా ఉంది. అయితే పెద్ది చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని గతంలోనే ప్రకటించారు. బట్ ఆ టైమ్ కు ధురంధర్ 2, టాక్సిక్ మూవీస్ కూడా విడుదల కాబోతున్నాయి. అఫ్ కోర్స్ ఇందుకు ఒక వారం ముందే విడుదలవుతున్నాయి ఆ రెండు సినిమాలు. అయితే ఆ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ కావడం, పెద్ది కూడా ప్యాన్ ఇండియా మూవీ కావడం వల్ల థియేటర్స్ సెట్ కాలేకపోయాయి. దీనికి తోడు, ధురంధర్ 2, టాక్సిక్ మూవీస్ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా పెద్ది చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ కారణంగా పెద్దిని వాయిదా వేశారు.

ఇక వాయిదా విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దీంతో పాటు కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించారు. పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ప్రకటించడంతో క్లారిటీ వచ్చేసింది. ఒక నెల తర్వాత తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నటు అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ తర్వాత మే1న విడుదల కాబోతున్న చిత్రాల పరిస్థితి ఏంటీ అనేది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తంగా పెద్ది రిలీజ్ డేట్ ఏప్రిల్ 30న అని ఖరారు చేశారు.

Tags

Next Story