Sree Leela : లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. త్రివిక్రమ్ సినిమాలో..!

Sree Leela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి మూవీతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది నటి శ్రీలీల.. మొదటిసినిమాతోనే అటు అందం, ఇటు అభినయంతో ఆకట్టుకొని మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడీ అమ్మడుకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. రవితేజ ధమఖాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. మూడో సినిమా ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్‌తో జత కట్టనుంది.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది.. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్దే మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను ఫిక్స్ చేశారట త్రివిక్రమ్.. ఇప్పటికే ఆమెతో కథచర్చలు జరగగా సెకండ్ హీరోయిన్‌గా చేసేందుకు శ్రీలీల కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.
హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ మూవీ మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com