వయసు పెరిగినా..వన్నె తరగని అందం..20 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ

వయసు పెరిగినా..వన్నె తరగని అందం..20 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ
Deepti Bhatnagar: దీప్తి భట్నాగర్.. ఈమె పేరు ఈ కాలం సినీప్రియులకు పెద్దగా తెలియకపోవచ్చు.

Deepti Bhatnagar: దీప్తి భట్నాగర్.. ఈమె పేరు ఈ కాలం సినీప్రియులకు పెద్దగా తెలియకపోవచ్చు. దీప్తి భట్నాగర్ తెలుగులో తక్కువ సినిమాలే చేసిన క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ "పెళ్లి సందడి". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. పెళ్లి సందడి హిట్ తర్వాత దీప్తీ భట్నాగర్ మళ్ళీ తెలుగు చిత్రాలలో పెద్దగా నటించలేదు. 22 ఏళ్ల తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తుంది ఈ 53 ఏళ్ల ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో దీప్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Deepti Bhatnagar Photo Source: Instagram
ఆటో డ్రైవర్ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. బాలయ్య సరసన సూల్తాన్ మూవీలో కనిపించింది. ఇక మా అన్నయ్య సినిమా చిన్న పాత్రలో మెరిసింది. తాజాగా 22 ఏళ్ల తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తుంది ఈ 53 ఏళ్ల ముద్దుగుమ్మ. అయితే ఈ సారి కూడా పెళ్లి సందడి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ లో హీరోగా శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ నటిస్తున్నాడు.


ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని దీప్తి భట్నాగర్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. పెళ్లి సందడి చిత్రంలో తాను 25 సంవత్సరాల క్రితం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారితో కలిసి పని చేశానని, మళ్లీ ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దీప్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story