Sreeleela: ఒక్క సినిమాకే ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్..

Sreeleela (tv5news.in)
Sreeleela: ఈమధ్య హీరోయిన్లు టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో సినిమాల్లో మెరవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క సినిమాలో నటించినా చాలు.. తమ టాలెంట్‌ను చూసి పెద్ద పెద్ద దర్శక నిర్మాతలే వారికి ఆఫర్లు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు. మరి వారి యాక్టింగ్‌కు అంత డిమాండ్ ఉన్నప్పుడు.. వారు కూడా దానికి తగినట్టు రెమ్యునరేషన్ డిమాండ్ చేయాలి కదా.. ప్రస్తుతం పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల అదే పనిలో ఉంది.
రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్ అంటే అందం, తెలుగుతత్వం ఉట్టిపడేలా ఉంటుంది. ఆ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనిపించేలా క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తారు దర్శకేంద్రుడు. అందుకే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో కేవలం ఒకేఒక్క సినిమాలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది కన్నడ భామ శ్రీలీల.
ఒకపక్క మెడిసిన్ చదువుతూనే.. మరోపక్క కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది శ్రీలీల. అక్కడ తాను చేసింది తక్కువ సినిమాలే అయినా.. అన్నీ చాలావరకు యూత్‌ను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దృష్టిలో పడిన శ్రీలీల టాలీవుడ్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. మొదటి సినిమా పెళ్లిసందడి సక్సెస్ తర్వాత ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.
ప్రస్తుతం రవితేజ, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోల సరసన నటిస్తున్న శ్రీలీల ఏకంగా కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేస్తోందట. ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ కాబట్టి నిర్మాతలు కూడా తన డిమాండ్‌కు ఒప్పుకుంటున్నట్టు టాక్. ఇక చేతిలో ఉన్న సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా శ్రీలీల టాలీవుడ్‌లోనే బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకుంటున్నారు ప్రేక్షకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com