Allu Arjun : పుష్ప 2 ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది..
అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2.. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది టీమ్. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి ఈవెంట్ జరగలేదు. ఈవిషయంలో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. వారి కోసం ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. బట్ లాస్ట్ మినిట్ లో పర్మిషన్ లేదు అని చెప్పారు. దీంతో ఇక రిలీజ్ డేట్ కు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈవెంట్ ఉండదు అనుకున్నారు. బట్ పుష్పరాజ్ వదల్లేదు. ఈవెంట్ ఉంది.
ఆదివారం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 2కు ఫిక్స్ అయింది. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఫంక్షన్ జరగబోతోంది. కాస్త టైమ్ దొరికింది కాబట్టి.. అన్ని పనులు జాగ్రత్తగా చూసుకునే వెసులు బాటు ఉంది. సో.. లేట్ అయింది కాబట్టి.. ఫంక్షన్ లేదు అనుకున్న ఫ్యాన్స్ కు ఈ న్యూస్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది.
మరోవైపు పుష్ప 2కు భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం.. వీళ్లు ఈ ఫంక్షన్ ను మల్లారెడ్డి కాలేజ్ లో నిర్వహించాలనుకోవడమే అంటున్నారు కొందరు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com