Ajith Kumar : అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ ట్రైలర్ విడుదల

కోలీవుడ్ టాప్ హీరో అజిత్‌కుమార్, త్రిష జంటగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన సినిమా విడాముయర్చి. ఈచిత్రాన్ని తెలుగులో ‘పట్టుదల’పేరుతో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ పట్టుదల మూవీ ట్రైలర్ విడుదలైంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసినా కుదరలేదు. లేటెస్ట్ గా ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నాం అని ట్రైలర్ తో పాటు ప్రకటించారు. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
ట్రైలర్ చూస్తే.. అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో నెవర్ బిఫోర్ అవతార్‌లో మెప్పించబోతున్నాడని అర్థం అవుతోంది. ట్రైలర్‌లో తన వాళ్ల కోసం అజిత్ చేసే యాక్షన్, చార్మింగ్ బ్యూటీ త్రిష తో క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అదరగొట్టబోతున్నానిపించేలా ఉంది.. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుందని ట్రైలర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్తమవుతుంది. . ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.
ఓంప్రకాష్ విజువల్స్ సినిమా లుక్‌ను పూర్తిగా మార్చేయటమే కాదు, బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడబోతున్న ప్రేక్షకులకు పట్టుదల సినిమా ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందనిపించేలా ఉంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో, బీజీఎంతో ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు పట్టుదల సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో పీక్స్‌కి చేరుకున్నాయి. మొత్తంగా ట్రైలర్ తో పట్టుదల మూవీపై అంచనాలు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఇక ‘పట్టుదల’ (విడాముయర్చి) సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com