Ram Mandir In Ayodhya : 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ఆయుష్మాన్ ఖురానాకు ఆహ్వానం

Ram Mandir In Ayodhya : ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆయుష్మాన్ ఖురానాకు ఆహ్వానం
ఆయుష్మాన్ ఖురానా జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు.

జనవరి 22న అయోధ్యలోని రామమందిరపు 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న తాజా నటుడు ఆయుష్మాన్ ఖురానా. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌(RSS)కు చెందిన ముంబై మహానగర్ సంపర్క్ ప్రముఖ్, CA అజిత్ పెండ్సే స్వయంగా ఆయనకు ముంబైలో ఆహ్వానాన్ని అందజేశారు. అంతకుముందు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, హరిహరన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, రణదీప్ హుడాతో సహా పలువురు ప్రముఖులు అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ఆహ్వానం అందుకున్నారు.

అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ-ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16 న ప్రారంభమవుతాయి. జనవరి 23 నుంచి రామ మందిరాన్ని సామాన్య ప్రజల కోసం తెరిచి ఉంచనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ మధ్యాహ్నం 1 గంటలోపు ముగియనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు వేడుక అనంతరం తమ ఆలోచనలను తెలియజేస్తారు. "సంప్రదాయం ప్రకారం, నేపాల్‌లోని జనక్‌పూర్ మరియు మిథిలా ప్రాంతాల నుండి 1000 బుట్టల్లో కానుకలు వచ్చాయి. జనవరి 20, 21 తేదీలలో దర్శనం ప్రజలకు మూసివేయబడుతుంది" అని ఆయన చెప్పారు. అయోధ్యలోని శ్రీ రాంలాలా ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల ప్రత్యేక పూజను ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story