Photo Moment: 'కంగువ' కోసం సూర్య సిక్స్ ప్యాక్.. ఫొటో వైరల్

Photo Moment: కంగువ కోసం సూర్య సిక్స్ ప్యాక్.. ఫొటో వైరల్
సూర్య మేకోవర్ పై లేటెస్ట్ అప్ డేట్.. 'కంగువ'లో పాత్ర కోసం కసరత్తు

'కంగువ' మూవీ అనౌన్స్ చేసినప్పట్నుంచి హీరో సూర్య తన రూపాన్ని ట్రాన్స్ ఫామ్ చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన పాత్రకు న్యాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. అతని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పలు ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా మరో ఫొటో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో సూర్య తన టోన్డ్ అబ్స్‌ని ప్రదర్శిస్తూ కనిపించాడు. మందపాటి, పొడవాటి గడ్డం అతని హార్డ్ వర్క్ కు నిదర్శనంగా నిలుస్తోంది.

లేటెస్ట్ గా రివీలైన ఈ ఫొటోతో అభిమానులంతా థ్రిల్ అవుతున్నారు. ఇందులో సూర్య కంగువాలోని తన పాత్ర కోసం మొత్తం రూపురేఖల్నే మార్చేసినట్టు తెలుస్తోంది. బలంగా, కండలతో కనిపిస్తోన్న సూర్య.. గత సంవత్సరం నుండి సూర్య పడుతున్న అలుపెరగని కఠోర శ్రమ ఫలితమే ఈ ట్రాన్స్ ఫార్మేషన్ గా తెలుస్తోంది.

'కంగువ' అనేది హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమిళ న్యూ ఇయర్ స్పెషల్ ట్రీట్‌గా ఏప్రిల్ 2024లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 'కంగువ; సినిమాకు సంబంధించి ఇటీవలే రిలీజైన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం 'కంగువ' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గత కొంత కాలంగా సూర్య తన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. వీరుడిలా సిద్ధమవుతూ వెయిట్ పెరిగి బల్కీ షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు నిదర్శనమే తాజాగా రివీలైన సిక్స్ ప్యాక్ సూర్య. దీంతో 'కంగువ'లో సూర్య రోల్ ఎలా ఉండబోతుందో, ఈ సినిమాతో ఆయన ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడోనని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story