సినిమా

Bigg Boss 5 Telugu: మానస్‌తో మాట్లాడకుండా నేను ఉండలేను: పింకీ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే విభిన్న మనస్తత్వాలు ఉన్న వారంతా ఒకేచోట కలిసి ఉండడం.

Bigg Boss 5 Telugu: మానస్‌తో మాట్లాడకుండా నేను ఉండలేను: పింకీ
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే విభిన్న మనస్తత్వాలు ఉన్న వారంతా ఒకేచోట కలిసి ఉండడం. అలాంటి వారికి అభిప్రాయాలు, ఆలోచనలు కూడా వేరుగానే ఉంటాయి. అందుకే హౌస్‌లో తరచుగా హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలే కాదు అప్పుడప్పుడు వారి మధ్య ప్రేమలు కూడా చిగురుస్తాయి. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ ప్రతీ సీజన్‌లో లవ్ బర్డ్స్ కామన్. మరి ఈ సీజన్‌లో లవ్ బర్డ్స్ ఎవరో క్లారిటీ లేదు కానీ వన్ సైడ్ లవర్స్ మాత్రం చాలామంది కనిపిస్తున్నారు.

ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రియాంక అడుగుపెట్టినప్పటి నుండి తాను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. తన జీవితంలోని ఒక్కొక్క దశను పంచుకుంటూ ప్రేక్షకులకు ప్రియాంక మరింత దగ్గరయింది. అందుకే హౌస్‌మేట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా తనను పింకీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాంటి పింకీలో ఒక నెగిటివ్ క్వాలిటీని కూడా ప్రేక్షకులు గమనించారు. అదే ఎవరి మీదైనా ఇష్టం పెంచుకుంటే వారి విషయంలో ఎమోషనల్‌గా వీక్ అయిపోవడం.

పింకీ మొదటి వారం నుండి అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది. అబ్బాయిలందరినీ అన్నయ్య అని పిలుస్తూ, అమ్మాయిలందరినీ అక్క అని పిలుస్తూ... హౌస్‌లో ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్‌తోనే ఉంటుంది. కానీ ఒక్క హౌస్‌మేట్‌ను మాత్రం పింకీ.. అన్నయ్య అని పిలవలేకపోతోంది. అదే మానస్. మానస్‌పై పింకీకి ఎంత ఇష్టముందో హౌస్‌మేట్స్‌కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా మానస్‌పై తనకు ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయని పింకీ పలుమార్లు బయటపెట్టింది.

ప్రస్తుతం బిగ్ బాస్‌లో ఆరవ వారంలోకి అడుగుపెట్టారు హౌస్‌మేట్స్. గేమ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఈ సమయంలో ప్రతీ ఒక్క హౌస్‌మేట్ తమ కెపాసిటీని మరింత పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ టాస్క్‌ల విషయంలో పింకీ అందరికంటే వెనుకబడడానికి కారణం తనకు మానస్‌పై ఉన్న ఫీలింగ్సే అని హౌస్‌మేట్స్ వాదన. తనను మానస్ పట్టించుకోవట్లేదని, తన గేమ్ తనను ఆడమని హౌస్‌మేట్స్ ఎంత చెప్పినా పింకీ వినలేకపోతోందని తెలుస్తోంది.

తాజాగా టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో పింకీ కాసేపు మైక్ ధరించడం మర్చిపోయింది. అందుకు కెప్టెన్ విశ్వ తనకు ఒక శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం మానస్‌తో ఒకరోజంతా మాట్లాడకూడదని చెప్పాడు. దానికి పింకీ.. నేను మానస్‌తో మాట్లాడకుండా ఉండలేనని తేల్చి చెప్పింది. మానస్ విషయంలో తానేమైనా తప్పు చేస్తున్నానా అని కాజల్‌తో జరిగిన సంభాషణలో అడిగింది పింకీ. పింకీ.. మానస్ వల్ల గేమ్ సరిగ్గా ఆడలేకపోతుందని ఇలాంటి ఎన్నో సంఘటనలు చూస్తే తెలుస్తోంది. ఈ విషయంలో తన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES