Pizza 3 Trailer : దయ్యానికీ, మనుషులకు మధ్య ఒక ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్

Pizza 3 Trailer : దయ్యానికీ, మనుషులకు మధ్య ఒక ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్
X
ఆద్యంతం సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్

హారర్ థ్రిల్లర్ గా 'పిజ్జా' ఫ్రాంచైజీలో వచ్చిన 2 సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని మూట గట్టుకున్న ఈ సినిమాలు అప్పట్లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు 'పిజ్జా 3' రాబోతోందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మధ్యే తమిళంలో రిలీజైన పిజ్జా 3 మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రల్లో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పిజ్జా 3' కోలీవుడ్ లో సక్సెస్ అయింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం పిజ్జా 3 ట్రైలర్ రిలీజైంది. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు వేటకి వెళ్ళినప్పుడు జింక అని పొరబడి ఒక మనిషిని వేటాడుతాడు. చనిపోయిన ఆ మనిషి తల్లితండ్రులు పుత్ర శోకంతో ఆ రాజుని శపించారు. అప్పటి నుంచి ఆ రాజు అనుభవించిన వేదనే అతి పెద్ద ఇతిహాసంగా మారింది’’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ వీడియో.. ఆద్యంతం సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తోంది. ఇక కథ, కథనం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాయి. విజువల్స్ హారర్ ని ఎలివేట్ చేస్తూ టెర్రిఫిక్ గా అనిపించాయి. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ల నటన మరో ఆకర్షణగా నిలుస్తోంది. కెమెరా వర్క్, నేపధ్య సంగీతం బాగున్నాయి. చూస్తంటే.. టాలీవుడ్ లో ఈ సినిమా క్లిక్ అయ్యేలా అనిపిస్తోంది.


ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్పీ నిర్మాతలు త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. “ పిజ్జా 3 విజువల్ వండర్. ప్రేక్షకులకు థ్రిల్ తో పాటు గొప్ప థియేట్రికల్ అనుభూతిస్తుంది అని నిర్మాతలు కొన్ని రోజుల క్రితమే తెలిపారు.

ఇదిలా ఉండగా.. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన పిజ్జా మూవీ 2012లో రిలీజైంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించిగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు ఆడుకలం నరేన్ , జయకుమార్, పూజా రామచంద్రన్, బాబీ సింహా వంటి వారు పలు పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా తమిళంలో వచ్చి పిజ్జాకి రీమేక్ గా రూపొందింది.

Tags

Next Story