Shruti Haasan Marriage: పెళ్లి రూమర్స్‌పై ఘాటు రియాక్షన్
ప్రస్తుతం తన తాజా చిత్రం 'సాలార్ పార్ట్ వన్: సీజ్ ఫైర్' విజయాన్ని ఆస్వాదిస్తున్న శృతి హాసన్, ఇప్పుడు కొన్ని తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచింది. ఆమెపై ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ తాజా కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన తర్వాత శృతి ట్రెండింగ్ లో నిలవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె అభిమానులు ఆమె 'రహస్య వివాహం' గురించి ఊహాగానాలు చేయడం ప్రారంభించారు.
ఇప్పుడు, శృతి ముందుకు వచ్చి తనపై వస్తోన్న పెళ్లి పుకార్లన్నింటినీ కొట్టిపారేసింది. ఆమె ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తనపై వస్తోన్న రూమర్స్ ను క్లియర్ చేయడానికి ఇన్‌స్టా స్టోరీలను షేర్ చేసింది. అందులో "నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయంలోనూ ఓపెన్ గా ఉండే నేను నా పెళ్లి విషయం ఎందుకు దాచి పెడతాను? అందువల్ల నా గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకుంటే మంచిది" అని సోషల్ మీడియా ఎక్స్‌లో శృతి పోస్ట్ చేసింది.
ఇదంతా ఎలా మొదలైంది?
ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి ఓ సోషల్ మీడియా సెన్సేషన్. సెలబ్రిటీలతో పార్టీలు చేసుకుంటూ వాళ్లతో ఫొటోలు దిగుతూ తాను కూడా ఓ సెలబ్రిటీ అయ్యాడు. సుహానా ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లాంటి వాళ్లతో అతడు తరచూ ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ మధ్య అతడు తన ఫ్యాన్స్ తో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి అడిగి ప్రశ్నకు ఒర్రీ స్పందించాడు. అనవసరమైన ఆటిట్యూడ్ చూపించే సెలబ్రిటీ ఎవరు అని ఆ వ్యక్తి అడగ్గా.. శృతి హాసన్ అంటూ వెంటనే స్పందించాడు ఒర్రీ. ఆమె తనతో చాలా రూడ్‌గా వ్యవహరించిందని అతడు చెప్పాడు. తననో ప్యూన్ అని అన్నట్లు కూడా తెలిపాడు. అయితే శృతి హాసన్ భర్త శాంతను హజారికా మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అతడు చెప్పడం విశేషం.
ఇదిలా ఉండగా, వర్క్ ఫ్రంట్ లో, శృతి హాసన్ తాజా చిత్రం 'సాలార్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మూవీ త్వరలో రూ. 300 కోట్ల నెట్ క్లబ్‌లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com