Nayan-Vignesh: దయచేసి మమ్మల్ని క్షమించండి: విఘ్నేష్ శివన్

Nayan-Vignesh: ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్, విఘ్నేష్ జంట వివాదంలో చిక్కుకున్నారు.. స్వామి వారి సన్నిధిలో చెప్పులేసుకుని తిరగడం కావాలని చేసింది కాదని, పొరపాటున జరిగిందని విఘ్నేష్ శివన్ వివరించారు.. దయచేసి క్షమించండి. దేవుడిపై మాకు అపార నమ్మకం ఉందని ఆయన అన్నారు.
తిరుమల మాడ వీధుల్లో కొత్త జంట చెప్పులు వేసుకుని తిరగడం వివాదాలకు కారణమైంది. నిజానికి మేము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అందుకే గడిచిన 30 రోజుల్లో 5 సార్లు కొండకు వచ్చాం.. కొన్ని అనివార్య కారణాలవల్ల స్వామి వారి సన్నిధిలో కాక మహాబలిపురంలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
అయితే పెళ్లైన వెంటనే కళ్యాణ మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి స్వామి కళ్యాణం వీక్షించి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. ఆ క్రమంలోనే స్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఎలాగూ ఇక్కడ పెళ్లి చేసుకోలేకపోయాం అని ఆలయ ఆవరణలో ఫోటో షూట్ చేసుకోవాలనుకున్నాం.
షూట్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది.. ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడం మా ఉద్దేశం కాదు. దయచేసి క్షమించండి అని విఘ్నేశ్ రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com