Johnny Master : జానీ మాస్టర్ పై పోక్సో కేస్.. గాలిస్తోన్న పోలీస్ లు

Johnny Master :  జానీ మాస్టర్ పై పోక్సో కేస్.. గాలిస్తోన్న పోలీస్ లు
X

జానీ మాస్టర్ వ్వవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బిజెపి శ్రేణులు కొందరు ఈ కేస్ ను చాలా సీరియస్ గా భావిస్తున్నారు. అతను లవ్ జిహాదీకి పాల్పడ్డాడు అనే ఆరోపణలతో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. తాజాగా జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ లు పోక్సో కేస్ నమోదు చేశారు. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి చేస్తూ ఇబ్బంది పెట్టాడు అనేందుక పక్కా ఆధారాలు సమర్పించడంతోనే పోక్సో కేస్ ను నమోదు చేసినట్టు సమాచారం.

కేస్ విషయం బయటకు వచ్చిన దగ్గర్నుంచీ జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. మొదట అతను నెల్లూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ లు నెల్లూరులోని డిపార్ట్ మెంట్ ను అలెర్ట్ చేశారు. జానీ అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడట. ప్రస్తుతం తన లాయర్స్ తో కలిసి పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈకేస్ నుంచి తను ఎలా బయట పడాలా అనే సమాలోచనలు చేసేందుకే లాయర్ ను కూడా ఉంచుకున్నాడు అంటున్నారు. అయితే అతను నెల్లూర్ నుంచి పరారీ అయ్యి ప్రస్తుతం లద్దాఖ్ లో ఉన్నట్టు సమాచారం అందడంతో హైదరాబాద్ పోలీస్ ల ప్రత్యేక బృందం అక్కడికి వెళుతోంది. ఖచ్చితంగా జానీని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరు పరచేందుకు పోలీస్ లు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే అతను లద్దాఖ్ లో ఉన్నట్టు తెలియడంతో అక్కడి పోలీస్ ల సాయంతో హైదరాబాద్ తరలించేందుకు వెళుతున్నారని సమాచారం. మొత్తంగా జానీ వృత్తి / వ్యక్తిగత జీవితం పూర్తిగా పాడైపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Tags

Next Story