Shalu Chaurasia : కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. అదుపులోకి నిందితుడు..!

Shalu Chaurasia : కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. అదుపులోకి నిందితుడు..!
X
Shalu Chaurasia : హైదరాబాద్‌లో సినీనటి చౌరాసియాపై దాడి కేసు కొలిక్కి వచ్చింది. కేబీఆర్‌ పార్కు వద్ద దాడి చేసి పారిపోయిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shalu Chaurasia : హైదరాబాద్‌లో సినీనటి చౌరాసియాపై దాడి కేసు కొలిక్కి వచ్చింది. కేబీఆర్‌ పార్కు వద్ద దాడి చేసి పారిపోయిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానగర్‌లో నివసించే బాబు.. సినిమాల్లో లైట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గత ఆదివారం రాత్రి కేబీఆర్‌ పార్కులో చౌరాసియాపై దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లాడు. ఆ సమయంలో కేబీఆర్‌ పార్కు వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కేసు దర్యాప్తులో ఆలస్యమైంది. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలనూ, ఇతర సాంకేతికతను వినియోగించి పోలీసులు కృష్ణానగర్‌, ఇందిరానగర్‌లో నిఘా పెట్టి బాబును అదుపులోకి తీసుకున్నారు. అతని గత నేర చరిత్రపైనా ఆరా తీస్తున్నారు.

Tags

Next Story