Home
 / 
సినిమా / Katrina Kaif Vicky...

Katrina Kaif Vicky Kaushal: పెళ్లి రోజే విక్కీ కౌశల్, కత్రినాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

Katrina Kaif Vicky Kaushal: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా వీరి పెళ్లి గురించే.

Katrina Kaif Vicky Kaushal: పెళ్లి రోజే విక్కీ కౌశల్, కత్రినాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
X

Katrina Kaif Vicky Kaushal: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా వీరి పెళ్లి గురించే. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వీరి పెళ్లి సందడి ఇప్పటికే మొదలయిపోయింది. సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ వీరి పెళ్లికి హడావిడిని షూరూ చేశారు. కానీ ఈ హడావిడిలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌పై ఓ కేసు నమోదయ్యింది.

రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి అందమైన వేడుక సిద్ధమయ్యింది. తాజాగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా రాజస్థాన్‌కు పయణమయ్యారు. గెస్ట్‌లు అందరు వచ్చేశారు. కానీ అదే వీరిపై పోలీస్ కేసుకు కారణమయ్యింది.

రాజస్థాన్‌కు చెందిన ఓ అడ్వకేట్‌ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి పెళ్లి జరుగుతున్న సిక్స్ సెన్సెస్ కోటకు సమీపంలోనే చౌత్‌మాత మందిర్‌ ఉంది. అది రాజస్థాన్‌లోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం. రోజుకు అక్కడికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. నిత్యం భక్తులతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది.

విక్కీ కౌశల్, కత్రినా పెళ్లి సందర్భంగా చౌత్‌మాత మందిర్‌కు వెళ్లే మార్గాన్ని డిసెంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 12 వరకు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది వీరిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. పెళ్లి కోసం అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేయడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story