7 Arts Sarayu: బిగ్ బాస్ ఫేమ్ 7 ఆర్ట్స్ సరయుపై పోలీస్ కేసు.. ఎందుకంటే..?

Sarayu Roy (tv5news.in)
7 Arts Sarayu: 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి, బోల్డ్ కంటెంట్‌తో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ యూట్యూబ్ సెలబ్రిటీగా మారిపోయింది సరయు. ఆమె వీడియోలతో ఫేమస్ అయ్యింది కాబట్టి అందరూ ఆమెను 7 ఆర్ట్స్ సరయు అనడం మొదలుపెట్టారు. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అవకాశం దక్కించుకుంది సరయు. తాజాగా తనపై పోలీస్ కేసు పెట్టారు కొందరు.
బిగ్ బాస్ సీజన్ 5లో అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది సరయు. తానెవ్వరో ప్రేక్షకులకు సరిగ్గా రిజిస్టర్ అవ్వకముందే మొదటివారంలో సరయు ఎలిమినేట్ అయ్యింది. అయినా కూడా ఇది తన యూట్యూబ్ ఛానెల్‌కు ప్లస్సే అయ్యింది. అందరూ 7 ఆర్ట్స్ సరయు అని పిలుస్తుండడంతో బిగ్ బాస్ షో వల్ల తన ఛానెల్‌కు సబ్ స్క్రైబర్స్ కూడా పెరిగారు.
సరయు, తన టీమ్‌తో కలిసి సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీని ప్రమోషన్ కోసం తన ఛానెల్‌లోనే ఓ వీడియో చేసింది. 2021 ఫిబ్రవరి 25న ఈ వీడియో రిలీజ్ అయ్యింది. ఇందులో కనిపించిన యాక్టర్స్ అందరూ తలకు గణపతి బొప్పా మోరియా అని రిబ్బన్ కట్టుకొని కనిపించారు.
అయితే ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వీడియో షూటింగ్ అంతా ఫిల్మ్ నగర్ ఏరియాలో జరగడంతో బంజారా హిల్స్‌కు కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు సిరిసిల్ల పోలీసులు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com