Shilpa Shetty: శిల్పా శెట్టిపై పోలీస్ కేసు.. తల్లి, చెల్లి కూడా ఇందులో భాగమే..

Shilpa Shetty: బాలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్‌లో కూడా శిల్పా శెట్టికి చాలానే క్రేజ్ ఉంది. ఈ నటి వెండితెరపై కనిపించి చాలాకాలమే అయినా.. బుల్లితెర కనిపిస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కొంతకాలం వరకు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ కూడా సాఫీగా సాగిపోయింది. కానీ అంతలోనే తన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో అంతా తలకిందులయ్యింది. ఇప్పుడు మరోసారి శిల్పా శెట్టిపై కేసు నమోదయ్యింది.
రాజ్ కుంద్రా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, వారిని అశ్లీల చిత్రాల్లో బలవంతంగా నటింపజేస్తు్న్నాడని కేసు నమోదయ్యింది. ఆ తర్వాత చాలాకాలం వరకు ఈ కేసు మొత్తం సినీ పరిశ్రమలోనే పెద్ద దుమారం రేపింది. అయినా కూడా శిల్పా శెట్టి తన భర్త అలాంటి వాడు కాదంటూ తనకు తోడుగా నిలబడింది. అప్పుడే కేసుల ఉచ్చులో పడిన శిల్పా.. మరోసారి అదే సమస్యను ఎదుర్కుంటోంది.
శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ 11న మరణించారు. కానీ అంతకంటే ముందే 2015లో సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హద్ అమ్రా దగ్గర నుండి రూ.21 లక్షలు అప్పు తీసుకున్నారు. 2017 జనవరి వరకు ఆ రుణాన్ని చెల్లించేయాలని వారి మధ్య ఒప్పందం జరిగింది. కానీ మధ్యలోనే సురేంద్ర మరణించారు.
సురేంద్ర శెట్టి అప్పు తీసుకున్న విషయం శిల్పా శెట్టికి, తన సోదరి షమితా శెట్టి, వారితో పాటు వారి తల్లికి కూడా తెలుసని, అయినా కూడా తిరిగి ఇవ్వడం లేదని పర్హద్ అమ్రా జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 28న వీరు ముగ్గురు ఈ కేసు కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com