Raj Tharun - Lavanya : రాజ్ తరుణ్ పై కేస్ బుక్ చేసిన పోలీస్ లు
యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్ పై పోలీస్ లు కేస్ బుక్ చేశారు. అతని మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకున్న పోలీస్ లు చార్జిషీట్ రెడీ చేశారు. ఈ చార్జిషీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడుగా చేర్చారు. కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారిన ఈ వ్వవహారంలో చాలామంది లావణ్యదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. కొన్ని వీడియో, ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఆమెకు వ్యతిరేకంగా కనిపించాయి. వ్యవహారం టివి, యూట్యూబ్ డిబేట్స్ వరకూ వెళ్లింది. కొన్ని రోజుల పాటు నాన్ స్టాప్ గా మీడియాలో నలిగిన వ్యవహారం ప్రస్తుతం కాస్త సద్దు మణిగింది. ఈ టైమ్ లో పోలీస్ లు చార్జిషీట్ దాఖలు చేయడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది ఇష్యూ.
ఈ సందర్భంగా పోలీస్ లు ‘ రాజ్ తరుణ్, లావణ్య కలిసి పదేళ్ల పాటు సహజీవనం చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. లావణ్య చెబుతున్న విషయాల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి..’ అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ మేరకు లావణ్య ఇంటితో పాటు ఆ ఇద్దరికీ కామన్ గా ఉన్న కొన్ని చోట్ల పోలీస్ లు సాక్ష్యాలు సేకరించారు. ఆ మేరకే చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేస్ లో ప్రస్తుతం రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నాడు. తాజా వ్వవహారంతో మరోసారి అతన్ని పోలీస్ విచారణకు పిలిచే అవకాశాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com