Manchu Manoj : మంచు మనోజ్ కు పోలీస్ ల నోటీస్ లు

Manchu Manoj :  మంచు మనోజ్ కు పోలీస్ ల నోటీస్ లు
X

మంచు కుటుంబంలో మంటలు ఇంకా చల్లారలేదు. రీసెంట్ గా భోగి మంటలతో సందడి చేసిన ఆ ఫ్యామిలీలో ఇక గొడవలు చల్లారాయి అనే అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పట్లో ఈ పంచాయితీ తెగేది కాదు అని తాజాగా మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ(మనోజ్, లక్ష్మి కాకుండా)తో తన మోహన్ బాబు యూనివర్శిటీలో సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ జల్లికట్టు నిర్వహించబోతున్నారు అనే టాక్ ఉంది. అయితే ఆ జల్లికట్టుకు మంచు మనోజ్ కూడా హాజరు కావాలనుకున్నాడు. కానీ అతను రావడం ఆ ఫ్యామిలీకి ఇష్టం లేదు.

అతను వస్తున్నాడు అని తెలిసిన పోలీస్ లు వెంటనే అలెర్ట్ అయ్యారు. అక్కడ లేనిపోని గొడవలు జరిగే అవకాశం ఉందని గ్రహించారు. దీంతో మోహన్ బాబు యూనివర్శిటీలోకి మనోజ్ కు ఎంట్రీ లేదని మనోజ్ కు నోటీస్ లు జారీ చేశారు పోలీస్ లు. అయితే కొన్నాళ్లుగా కాస్త రెచ్చగొట్టే ధోరణిలోనే కనిపిస్తోన్న మనోజ్ కాలేజ్ వద్దకు వెళతాడు అనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ పోలీస్ లు నోటీస్ లు ఇచ్చాక వెళ్లడం ఓ రకంగా అతనికే మైనస్ అవుతుంది. అయినా అక్కడికి వెళ్లడం ద్వారా తన ఈగోను శాటిస్ఫై చేసుకోవచ్చు అనేది మనోజ్ భావన కావొచ్చు. ఒకవేళ పోలీస్ ల నోటీస్ లు ధిక్కరించి వెళితే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలకు అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదేమైనా మోహన్ బాబుకు ఈ వయసులో తనయుల వల్ల ఇలాంటి సమస్యలు రావడం బాధాకరం అనే చెప్పాలి.

Tags

Next Story