Mehaboob Dil Se : బిగ్ బాస్ టీమ్ బర్త్ డే పార్టీ.. పోలీస్ ల ఎంట్రీ

Mehaboob Dil Se : బిగ్ బాస్ టీమ్ బర్త్ డే పార్టీ.. పోలీస్ ల ఎంట్రీ
X

రేవ్ పార్టీలు మన దేశంలో నిషేధం. సరే రేవ్ పార్టీలు కాదు.. కాస్త ఎక్కువ మంది కలిసి ఏదైనా గ్రాండ్ గా లిక్కర్ తో కూడిన పార్టీలు చేసుకోవాలంటే పోలీస్ ల పర్మిషన్ ఉండాలి. ముఖ్యంగా రిసార్ట్స్ లో. అవేం లేకుండా రేవ్ పార్టీని తలపించేలా బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్లింది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఫేమ్ అయిన కొందరు. వీరితో పాటు ఇంకొందరు యాంకర్స్, ఇతర బుల్లితెర పర్సన్స్ కూడా ఉన్నారు.

యూ ట్యూబర్ గా ఫేమ్ అయ్యి.. ఫేమ్ తో బిగ్ బాస్ లోకి వెళ్లిన మహబూబ్ దిల్ సే అనే నటుడి బర్త్ డే సందర్భంగా ఘట్కేసర్ పరిధిలో ఉన్న అంకుశాపూర్ దగ్గరలో ఉన్న ‘ద కాంటినెంట్ లక్షరీ స్టే కాషన్’ అనే రిసార్ట్ లో దాదాపు 25 మందికి పైగా కలిసి పార్టీ నిర్వహించుకుంటున్నారట. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి వెళ్లి రెయిడ్ చేశారు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే మొదట ఇది రేవ్ పార్టీ అనే ఇన్ఫర్మేషన్ తోనే పోలీస్ లు అక్కడికి వెళ్లారట. కానీ రేవ్ పార్టీ కాదని తేలిందంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో యంగ్ స్టర్స్ కూడి పార్టీ చేసుకుంటున్నప్పుడు పోలీస ల పర్మిషన్ అవసరం. అది లేదు కాబట్టి వీరిపై కేస్ లు నమోదు చేశారు. వీరిలో కోలా సుధీర్ కుమార్ అనే వ్యక్తిని A-1 గా చేర్చారు పోలీస్ లు. అతనెవరు.. అతనికీ ఈ టీమ్ కు ఉన్న సంబంధం ఏంటీ అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దీంతో పాటు 11.2 లీటర్ల విస్కీ, 7.15లీటర్ల బీర్ బాటిల్స్ ను సీజ్ చేశారు పోలీస్ లు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కానీ.. కొన్ని సార్లు చిన్న విషయాలే పెద్ద ఇష్యూస్ అవుతాయి. మరి ఈ కేస్ కు సంబంధించి మహబూబ్ అండ్ టీమ్ ఏం చెబుతారో చూడాలి.

Tags

Next Story