Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీస్ నిఘా

Allu Arjun :  అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీస్ నిఘా
X

అభిమాన హీరోల గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ హీరోల ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదిప్పుడు. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే బూతులు తిడుతూ రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ.. అవతలి వారిపై దాడి చేస్తున్నారు. ఈ విషయంలో ఏ హీరో ఫ్యాన్స్ కూడా తక్కువేం కాదు. బట్ అన్నిసార్లూ ఇది చెల్లుబాటు కాదు. ముఖ్యంగా రాజ్యం తలచుకున్నప్పుడు. అందుకే ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొందరు తెలంగాణ పోలీస్ నిఘాలో ఉన్నారు. ఓ రకంగా ఇది వార్నింగ్ లాంటి కథనం అనుకోవచ్చు.

కొన్నాళ్లుగా స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపైనా కేస్ లు నమోదయ్యాయి. ఈ కేస్ లో అల్లు అర్జున్ గంటల వ్యవధిలో బెయిల్ తెచ్చుకుని బయట పడ్డాడు. అయితే తమ హీరోను జైలుకు పంపించాడని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా విరుచుకుపడుతున్నారు. బూతులు తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.ప్రస్తుతం వీరిపైనే తెలంగాణ పోలీస్ లు నిఘా పెట్టారు. ఇప్పటికే పరిధికి మించి పోస్ట్ లు పెట్టిన వారికి సంబంధించి ఓ లిస్ట్ తయారు చేశారట.ఇలా తిట్టిన వారిలో ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన వారినే ఎక్కువగా పోలీస్ లు టార్గెట్ చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా.. ఆ ప్రాంత పోలీస్ లతో వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారట. త్వరలోనే వాళ్లందరినీ అరెస్ట్ చేయబోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అల్లు అర్జున్ ను వదిలేదే లేదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం తీరు. అందుకే ఐకన్ స్టార్ బెయిల్ ను రద్దు చేయించి మళ్లీ అరెస్ట్ చేసేందుకు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేయబోతున్నారు తెలంగాణ పోలీస్ లు. సో.. సిట్యుయేషన్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కాబట్టి అభిమానులు కూడా సంయమనంతో ఉంటే బెటర్. అల్లు అర్జున్ కు బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి బెయిల్ పై వచ్చాడు. ఫ్యాన్స్ కు అంత సీన్ ఉండదు. బుక్ అయితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. సో.. ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది.. అసలు పెట్టకపోతే ఇంకా మంచిది.

Tags

Next Story