Ponniyin Selvan 1 : పొన్నియిన్ సెల్వన్.. మణిరత్నం మార్కు స్పష్టంగా..

Ponniyin Selvan 1 : భారీ బడ్జెట్ తో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ 'పి.ఎస్.1' సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో అంచనాలు భారీగా పెంచేసిన ఈ హిస్టారికల్ డ్రామా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజయ్యింది.
'వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తొక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు, ప్రతికారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి..' అంటూ రానా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా నటించగా.. వందియదేవన్ గా కార్తీ, పొన్నియన్ సెల్వన్ గా జయం రవి కనిపించబోతున్నారు. నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్, కుందవనిగా త్రిష అలరించబోతున్నారు. ఇంకా.. ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, శోభిత ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు వంటి వారు నటించారు.
ఈ హిస్టారికల్ డ్రామాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. మూడున్నర నిమిషాల ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచేసిన 'పొన్నియన్ సెల్వన్' దసరా బరిలో విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com