Pooja Bhatt : తండ్రికి లిప్ లాక్ పై స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చిన పూజా భట్

1990లో, పూజా భట్, ఆమె తండ్రి మహేష్ భట్ ఒక మ్యాగజైన్ కవర్‌పై ఒకరి పెదాలపై ఒకరినొకరు ముద్దు పెట్టుకున్న ఫొటో అప్పట్లో వివాదంగా మారింది. ప్రస్తుతం మరోసారి ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, పూజా భట్ చేసిన కామెంట్సే. పూజా ఆ ఫోటో గురించి ఏదైనా విచారం వ్యక్తం చేస్తున్నారా అని సిద్దార్ఖ్ కన్నన్ అడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది, "లేదు, ఎందుకంటే నేను చాలా సరళంగా చూస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ క్షణం ఎలాగైనా సూచించవచ్చు, తప్పుగానూ సూచించవచ్చు. మీకు ఆడపిల్లలు ఉన్నంటే... వారు ఏదైనా బాధకు గురైనపుడు పిల్లలు 'మమ్మీ, పాపా నాకు ఒక ముద్దు ఇవ్వు' అని తరచుగా అడుగుతుంటారని షారూఖ్ చెప్పినట్లు నాకు గుర్తుంది. నేను ఇప్పటికీ నా తండ్రికి 10-ఏళ్ల కూతురునే. ఆ ప్రాణం ఎక్కడున్నా నాకు అలాగే ఉంటుంది” అని ఆమె చెప్పుకొచ్చింది.
“కాబట్టి ఇది పూర్తిగా అమాయకమైన క్షణం. ఇది బంధించబడింది. మరి దాని అర్థం ఏమిటో, చదవాలనుకునే వారు చదువుతారు, చూడాలనుకునే వారు చూస్తారు. ఈ విషయాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రజలు తండ్రి, కుమార్తె మధ్య సంబంధాన్ని వేరే కోణం నుండి చూడగలిగితే, వారు ఏమైనా చేయగలరు. అప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుకుందాం. ఇది అద్భుతమైన జోక్" అని ఆమె స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు.
పూజా భట్ 'బిగ్ బాస్ OTT 2' జర్నీ గురించి
బిగ్ బాస్ OTT 2లో కనిపించిన పూజా భట్, ఎల్విష్ యాదవ్, అభిషేక్ మల్హాన్, బేబికా ధుర్వే, మనీషా రాణిలతో కలిసి ఫైనల్‌కి అర్హత సాధించింది. బిగ్ బాస్ OTT రెండవ సీజన్ జూన్ 17న ప్రారంభమైంది. తరువాత షో సమయంలో, పూజా భట్ తండ్రి మహేష్ భట్ కూడా ఆమెకు మద్దతుగా కనిపించారు. అతను ఇతర పోటీదారులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాడు. తన కుమార్తె గురించి అనేక కథలను పంచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com