Pooja Hedge: పూజా హెగ్డే షాకింగ్ పోస్ట్.. ట్వీట్ వైరల్

Pooja Hedge: రాధేశ్యామ్ బ్యూటీ పూజాహెగ్డే ఎక్కడా తగ్గట్లేదుగా.. వరుస ప్రాజెక్టులతో బిజీ.. టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైనా ఆమె పేరే వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ల జాబితాలో పూజా హెగ్డే చోటు దక్కించుకుంది. రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే తన నటనతో మెప్పించిందని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె అద్భుతంగా నటించిందని అభిమానులు అంటున్నారు.
ఈ క్రమంలో పూజా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె తనకు మేకప్ చేస్తున్న సహాయకులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో లేని టీమ్ మెంబర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. రాధేశ్యామ్ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమా షూటింగ్‌లో తన అసిస్టెంట్లు చేసిన పనికి తాను కృతజ్ఞతతో ఉంటానని పూజా హెగ్డే తెలిపింది.
ఈ ప్రయాణంలో తనకు తోడుగా వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఏది ఏమైనా రాధేశ్యామ్ రిజల్ట్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పూజా ట్వీట్ చేసింది. రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని టాక్.
కథల విషయంలో ప్రభాస్ మరింత జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న తరువాతి సినిమా సక్సెస్ అవుతుందిని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా ప్రభాస్ సినిమాపై అభిమానుల్లో క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది.
To my beautiful team (the ones in this photo and the ones not). Thank you for taking care of me.Whatever the result of the film may be, know that I am grateful for all that you have done for me in the course of this film. Ty for being you ❤️ #appreciationpost #radheshyam #prerna pic.twitter.com/TU2Aoneb8E
— Pooja Hegde (@hegdepooja) March 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com